Salman Khan Security: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర సర్కార్ భద్రతను పెంచింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర హోం శాఖ ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
బెదిరింపు లేఖ
పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రికి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ లెటర్‌తో అప్రమత్తమైన సల్మాన్ ఖాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ రోజూ ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్తారు. ఆ సమయంలో ఒక ప్లేస్ దగ్గర బ్రేక్ తీసుకుంటారు. సలీమ్ ఎక్కడైతే బ్రేక్ తీసుకుంటారో అక్కడే ఓ బెంచ్ మీద ఈ బెదిరింపు లేఖ దొరికింది. అందులో మూసేవాలాను చంపినట్లే చంపేస్తామన్నట్లుగా రాసి ఉంది. ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు.
ఎవరు చేసి ఉంటారు?
బెదిరింపు లెటర్ ఎవరు పెట్టి ఉంటారని..? స్థానికులను విచారణ చేస్తున్నారు. మరోపక్క సల్మాన్ ఖాన్ కి, అతడి తండ్రికి సెక్యూరిటీ పెంచారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాను తన సొంత గ్రామంలో చంపేశారు. బిష్ణోయ్ గ్రూప్ సిద్ధూని చంపినట్లుగా వెల్లడించింది. ఇప్పుడు వారే సల్మాన్‌ని కూడా బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ ముఠా.. సల్మాన్ హత్యకు ప్లాన్ చేశారని.. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని చెబుతుంటారు.
Also Read: Delhi road rage: షాకింగ్ వీడియో- రోడ్డుపై వాగ్వాదం, బైకర్‌ను ఢీ కొట్టిన స్కార్పియో డ్రైవర్!
Also Read: Kerala Norovirus: కేరళలో మరో వైరస్ కలకలం- ఇద్దరు చిన్నారుల్లో లక్షణాలు!