Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. తాజాగా 2,779 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా నమోదైంది.







  • మొత్తం కరోనా కేసులు: 4,31,81,335

  • ‬మొత్తం మరణాలు: 5,24,701

  • యాక్టివ్​ కేసులు: 25,782

  • మొత్తం రికవరీల సంఖ్య: 4,26,30,852


వ్యాక్సినేషన్







దేశవ్యాప్తంగా ఆదివారం 2,57,187 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,12,87,000కు చేరింది. మరో 2,78,059 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్‌ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి.  అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.


Also Read: Online Mobile Gaming: సీక్రెట్‌గా ఆన్‌లైన్‌లో బెట్టింగ్, తరవాత జరిగింది ఇదీ..


Also Read: Arangetram Ceremony: కాబోయే కోడలి కోసం ముఖేశ్ అంబానీ ‘అరంగేట్రం వేడుక’ ఆమె నృత్యంతో అంతా ఫిదా - వీడియో