Accused Arrested in Saif Ali Khan Attack Case | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 16న నటుడిపై అతడి నివాసంలో నిందితుడు కత్తితో దాడికి పాల్పడటం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి విస్తృతంగా గాలించారు. పలు టీమ్స్ ఏర్పడి ముంబైతో పాటు మహారాష్ట్రను సైతం జల్లెడ పట్టింది ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ టీమ్. ఈ క్రమంలో థానెలో శనివారం రాత్రి నిందితుడు విజయ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తానే ఈ నేరం చేసినట్లు నిందితుడు అంగీకరిచాడని ముంబై పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల తరువాత ముంబై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
నిందితుడు ఎవరంటే..
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి జరిగిందని తెలియగానే అటు బాలీవుడ్, ఇటు ముంబై ఉలిక్కిపడింది. అది కూడా నటుడి నివాసంలోనే ఓ దుండగుడు ఆయనపై హత్యాయత్నం చేయడం మామూలు విషయం కాదు. నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడింది ఎవరా అని అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎన్నోచోట్ల గాలించిన పోలీసులు, ఎంతో మందిని విచారించిన అనంతరం అసలు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నటుడిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి పేరు విజయ్ దాస్. అతడు ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేస్తున్నాడని ముంబై పోలీసులు వెల్లడించారు. నటుడిపై దాడి చేసింది తానేనని విచారణలో నిందితుడు అంగీకరించాడని తెలిపారు. రెస్టారెంట్లో పనిచేసే ఒక సాధారణ వెయిటర్ ప్రముఖ నటుడిపై, అది కూడా ఆయన ఇంట్లోకి చొరబడి దాడి చేశాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. దీని వెనుక ఎవరున్నారు, దాడి ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆ సమయంలో కరీనా ఎక్కడ?
సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో నటుడి భార్య కరీనా కపూర్ ఇంట్లో లేరని ప్రచారం జరిగింది. దాన్ని సైఫ్ కుటుంబసభ్యులు ఖండించారు. కానీ కత్తితో దాడి జరిగిన తరువాత కరీనా ఇంటికి వచ్చారని వాదనలు ఉన్నాయి. ఆటోవాలాను సాయం అడిగి ఆసుపత్రికి వెళ్లే సమయంలో కరీనా కపూర్ ఉన్నారని ఎక్కడా చెప్పలేదు. గాయాలతో ఉన్న సైఫ్ అలీఖాన్ తన పేరు చెప్పి తనను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని కోరినట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. నటుడ్ని తాను హాస్పిటల్‌కు తీసుకెళ్లానని, అయితే వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆటోడ్రైవర్ తెలిపాడు.
Also Read: Saif Ali Khan Attacker: ఇతనే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది - ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు