90వ దశకంలో పుట్టిన వారికి రెనాల్డ్స్ పెన్‌తో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలో చదువుకున్న వారందరూ తమ విద్యార్థి జీవితంలో ఏదో ఒక దశలో రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ వాడే ఉంటారు. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇంక్ అయిపోతే రీఫిల్ మార్చి వాడుకునేవారు, పెన్ విరిగితే మళ్లీ ఇలాంటి పెన్నే కొనేవారు కూడా ఉన్నారు. కానీ కొన్ని సోషల్ మీడియా పోస్టులు అందరి మనసులను ఒక్కసారిగా బరువెక్కించింది.


ఆ సోషల్ మీడియా పోస్టుల్లో ఏం ఉంది?
పెన్నులకు సంబంధించి ఐకానిక్ బ్రాండ్ అయిన రెనాల్డ్స్‌ను మూసి వేస్తున్నారని, ఇకపై రెనాల్డ్స్ పెన్నులు మార్కెట్లో కనిపించవని కొన్ని సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. దీంతో నెటిజన్లు ఈ కలంతో తమ స్నేహం గురించి పోస్టులు పెట్టారు. లాస్ట్ బ్యాచ్ కావడంతో వాటిని కొని గుర్తుగా పెట్టుకోవాలని కూడా కొందరు అనుకున్నారు. రెనాల్డ్స్ పెన్నుల్లో ‘045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్’ పెన్నులు చాలా ఫేమస్. ఈ పెన్నుల్లో లేజర్ టిప్స్ అందించే వారు. దీని కారణంగా ఇంక్ కూడా లీక్ అయ్యేది కాదు. చొక్కాలు పాడవ్వకుండా ఉండేవి. అందుకే వీటిని ఉపయోగించడానికి విద్యార్థులు ఇష్టపడేవారు.


ఆ పోస్టు నిజం కాదన్న రెనాల్డ్స్
అయితే ఈ పోస్టులకు రెనాల్డ్స్ చెక్ పెట్టింది. అందులో ఏమాత్రం నిజం లేదని తమ అధికారిక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రకటించింది. భారతదేశంలో తమకు 45 సంవత్సరాల చరిత్ర ఉందని, క్వాలిటీకి, కొత్తదనానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. అలాగే భారతదేశంలో ఇంకా తమకు బలమైన ప్లాన్లు ఉన్నాయని తెలిపింది. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అసలైన సమాచారం కంపెనీ వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే లభిస్తుందని తెలిపింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. 






















Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial