Mukesh Ambani Death Threat:
మళ్లీ బెదిరింపులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani Death Threat) మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఆయనను చంపేస్తామంటూ ఇటీవలే సెక్యూరిటీకి మెయిల్ పంపాడో వ్యక్తి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి మెయిల్ వచ్చింది. ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి. గతంలో పంపిన మెయిల్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ రూ.20 కోట్లను రూ.200 కోట్లకు పెంచానంటూ మెయిల్ పంపాడు. అడిగినంత ఇవ్వకపోతే చంపడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపైనా ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వరుస మెయిల్స్‌తో భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులూ ఈ మెయిల్స్‌ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
ముకేశ్ అంబానీని (Mukesh Ambani) చంపేస్తానంటూ ఇటీవలే బెదిరింపు మెయిల్ రావడం అలజడి సృష్టించింది. ముకేశ్ అంబానీ కంపెనీ మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించాడు. "రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా దగ్గర బెస్ట్ షూటర్స్ ఉన్నారు" అని మెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ మొదలు పెట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...రాత్రి 8.51 నిముషాలకు ఈ మెయిల్ వచ్చింది. షదాబ్ ఖాన్ పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు సెక్యూరిటీ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ మెయిల్‌ని ఫొటో తీసిన సెక్యూరిటీ ఆ ఫొటోను పోలీసులకు పంపింది సెక్యూరిటీ. గతంలోనూ ఇలానే ముకేశ్ అంబానీకి హత్యా బెదిరింపులు వచ్చాయి. గతేడాది బిహార్‌కి చెందిన ఓ వ్యక్తి ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్నీ చంపేస్తామని బెదిరించాడు. వెంటనే నిఘా పెట్టిన పోలీసులు ఆ నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.