ముంబయిలోని 'నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ)' అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు.



వివరాలు..

* ఆఫీసర్ (అనలిస్ట్‌ గ్రేడ్): 56 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ - 40, ఈడబ్ల్యూఎస్ - 02, ఓబీసీ - 09, ఎస్సీ - 04, ఎస్టీ - 01.

విభాగాలవారీగా ఖాళీలు..


➥ లెండింగ్ ఆపరేషన్స్: 15 పోస్టులు


➥ హ్యూమన్ రిసోర్సెస్: 02 పోస్టులు


➥ ఇన్వెస్ట్‌మెంట్ & ట్రెజరీ: 04 పోస్టులు


➥ ఐటీ & ఆపరేషన్స్: 04 పోస్టులు


➥ జనరల్ అడ్మినిస్ట్రేషన్: 07 పోస్టులు


➥ రిస్క్ మేనేజ్‌మెంట్: 10 పోస్టులు


➥ లీగల్: 02 పోస్టులు


➥ ఇంటర్నల్ ఆడిట్ & కంప్లయన్స్: 03 పోస్టులు


➥ కంపెనీ సెక్రటేరియట్: 02 పోస్టులు


➥ అకౌంట్స్: 02 పోస్టులు


➥ స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ & పార్ట్‌నర్‌షిప్స్: 04 పోస్టులు


➥ ఎకనామిస్ట్: 01 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.10.2023 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.10.1991 - 01.10.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం..


➥  మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల (సెక్షన్-ఎ, సెక్షన్-బి) నుంచి మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. 


➥ 'సెక్షన్-ఎ'లో 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-15 ప్రశ్నలు-15 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-10 ప్రశ్నలు-10 మార్కులు, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్-15 ప్రశ్నలు-15 మార్కులు. పరీక్ష సమయం 30 నిమిషాలు. 


➥ ఇక సెక్షన్-బిలో 40 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. ఇందులో అభ్యర్థుల ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.


➥ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

అర్హత మార్కులు..


➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను ఒక్కో సెక్షన్‌కు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 35 శాతంగా నిర్ణయించారు. 


➥ ఇక రెండు సెక్షన్లకు కలిపి కనీస అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతంగా నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతంగా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.


➥ ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: నవంబర్/ డిసెంబర్ 2023.


➥ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్: పరీక్షకు 10 రోజుల ముందు నుంచి.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..