Rat 'thief':  ఎలుకలు మద్యం తాగేశాయి.. డీజిల్ ట్యాంక్‌కు చిల్లు పెట్టాయి.. గోడౌన్లలో బియ్యం తినేశాయి. లాంటి కథలను అప్పుడప్పుడూ పేపర్లలో చదువుతూ ఉంటాం. ఎందుకంటే అవి నిజంగా కథలే. అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన తర్వాత ఏదో ఓ కారణం చెప్పాలని అక్రమార్కులు ఆ కథలు చెబుతున్నారు. కానీ నిజంగా ఎలుకలు కూడా దొంగతనం చేస్తాయి. ఈ విషయం సీసీ కెమెరా సాక్షిగా బయటపడింది. ఆ దొంగను అరెస్ట్ చేసి.. చోరీ సొత్తును రికవరీ కూడా చేశారు. 



ముంబైలోని గోకుల్‌ధాం కాల‌నీలో నివాసం ఉండే మహిళ  బ్యాంకులో జ్యూవెల‌రీని డిపాజిట్ చేసేందుకు బంగారం తీసుకుని వెళ్లారు. ఆమె పిల్లలు కూడా ఉన్నారు. దారి మధ్యలో వడాపావ్ తిందామని ఆగారు. బంగారం సంచిని పిల్లలకు ఇచ్చారు. అయితే పిల్లలు ఎక్కడో పడేసుకున్నారు. దీంతో ఆమె ఎవరో దొంగలు ఎత్తుకుపోయి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్కడ సీసీ కెమెరాలుండటంతో సులువుగానే దొంగను పట్టుకున్నారు. సొత్తును రికవరీ చేశారు. ఇంతకీ దొంగెవరంటే ఎలుక.


గుడ్‌బై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఎమోషనల్ అవుతున్న నైన్‌టీస్ కిడ్స్


పిల్లలు వడాపావ్ తిని.. చేతిలో అడ్డం ఎందుకులే అని ఆ బంగారం ఉన్నసంచిని డస్ట్ బిన్‌లో పడేశారు. పక్కనే ఎలుకలు ఉన్నాయి. ఆ డస్ట్ బిన్‌లో పడేసిన వడాపావ్‌లను తీసుకెళ్లి కడుపు నింపుకునే ఎలుకలు.. ఆ సంచిలో కూడా అదే ఉన్నాయనుకుని లాక్కెళ్లాయి, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.  ఎలుక‌ల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని మ‌హిళ‌కు అప్ప‌గించారు. 


పుట్టుక నుంచి మరణం వరకూ అన్నీ రికార్డే - ఆధార్‌లో రాబోతున్న మార్పులు ఇవే !


మొత్తంగా బంగారం విలువ రూ. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల వరకూ ఉంటుంది. ఈ కేసు  వైరల్ అయింది. పాపం ఎలుకలు కావాలని చేసింది కాదని.. అవి ఆహారం కోసం చేసిన ప్రయత్నాల్లోభాగంగా దాన్ని తీసుకెళ్లాయని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. బంగారం రికవరీ చేసి వాటిని వదిలి పెట్టేశారు.