Ayodhya Shri Ram Temple Celebrations: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ విశ్వ పండగైంది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సుమారు వంద మంది ప్రముఖులు అయోధ్యను సందర్శించి కార్యక్రమాన్ని తిలకించనున్నారు. ఉదయం 11.00 గంటలకు ఆలయానికి చేరుకోనున్నా ప్రధానమంత్రి మోదీ దాదాపు మూడున్నర గంటల పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు. 


రెండు గంటల పాటు మంగళవాయిద్యాలు


మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 25 రాష్ట్రాలకు చెందిన మంగళవాయిద్య బృందాలు ఇక్కడకు చేరుకున్నాయి. వారంతా సుమారు రెండు గంటల పాటు మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతాన్ని మరింత అహ్లాదకరంగా మార్చబోతున్నారు. అయోధ్య నగరాన్ని 2,500 క్వింటాళ్ల పూలతో అలంకరించారు.


27 నుంచి వస్తే మంచిదని సూచన 


'ప్రాణ్‌ప్రతిష్ఠ' అనంతరం భక్తుల కోసం ఆలయం తలుపులు తెరవబోతున్నారు. ప్రస్తుతానికి రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నెలాఖరు నుంచి రద్దీ సాధారణ స్థితికి రాబోతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేస్తోంది. అందుకే జనవరి 27 తర్వాత మాత్రమే ఆలయ సందర్శనకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది. 


ముందే తరలి వస్తున్న భక్తులు


అయితే భక్తులు మాత్రం మంగళవారం నుంచి అయోధ్య రామ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే వేల మంది అయోధ్యకు చేరుకున్నారు. ఇవాళ జరిగే వేడుకకు హాజరుకాలేమని తెలిసినా రేపటి నుంచి స్వామిని చూడవచ్చని ఆశతో ముందే ఇక్కడకు చేరుకుంటున్నారు. స్వామి దర్శనం ఎప్పుడు కలిగితే అప్పుడే అయోధ్య నుంచి వెళ్తామని భక్తులు తేల్చి చెబుతున్నారు. 


టైట్ సెక్యూరిటీ


దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్న టైంలో ఈ వేడుకు టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నిపర్‌ల రెండు బృందాలు, ATS కమాండోల ఆరు బృందాలు యాంటీ డ్రోన్ టెక్నాలజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పారామిలటరీకి చెందిన 15,000 మంది పోలీసులు అయోధ్య కోసం కాపలాగా ఉంటున్నారు. అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మాట్లాడుతూ, "అయోధ్య  వచ్చే గెస్ట్‌లతో సమన్వయం చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కేంద్రీకృత స్ప్రెడ్‌షీట్‌లో ముఖ్యమైన అతిథుల వివరాలు అప్‌డేట్ చేస్తున్నాము. అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సంబంధిత విభాగాలు, ఏజెన్సీలను అప్రమత్తం చేస్తున్నాము. అన్నారు.  


11 భాషల్లో సైన్ బోర్డులు 


విభిన్న ప్రాంతాల నుంచి భక్తులు, వీఐపీలు వస్తున్న వేళ భారీ సంఖ్యలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. 11 ప్రధాన భాషల్లో అయోధ్య నలువైపులా సైన్‌ బోర్డులు పెట్టారు. 400 సైన్ బోర్డులు ల్యాండ్‌మార్క్‌ల వద్ద ఉంచారు. సాధారణ ప్రజలు చలిని తట్టుకునేందుకు 300 చోట్ల గ్యాస్‌తో నడిచే హీటర్లు ఉంచారు. ఇప్పటికే హోటళ్లు, ఇతర పర్యాటక ప్రదేశాలు, విడిది కేంద్రాలు కిటకిట లాడుతున్నాయి. వీటితోపాటు 25,000 పడకలతో అతిపెద్ద ఎనిమిది తాత్కాలిక టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. 


Also Read: రామ రావణ యుద్ధంలో రాముడి రథ సారధి ఎవరు - రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా!


Also Read:రామాయణం గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు - వీటికి సమాధానం చెప్పగలరా!