New Chief Election Commissioner: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్- మే 15 నుంచి బాధ్యతల స్వీకరణ

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 12 May 2022 03:02 PM (IST)

New Chief Election Commissioner: నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీమ్ కుమార్‌ను నియమించారు. మే 15 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్- మే 15 నుంచి బాధ్యతల స్వీకరణ

NEXT PREV

New Chief Election Commissioner:  భారత కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌ను నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Continues below advertisement







ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. 2022, మే 15 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.



రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని రెండో క్లాజ్ ప్రకారం శ్రీ రాజీవ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల అధికారిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. 2022, మే 15 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.                                                               - కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి


2022లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది.



  • 2020 సెప్టెంబర్ 1న రాజీవ్ కుమార్.. ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా చేరారు. 

  • అంతకుముందు 2020 ఏప్రిల్‌లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

  • 1984 ఐఏఎస్ బ్యాచ్‌ ఝార్ఖండ్​ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌ కుమార్‌కు గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది.


Also Read: Utkarsh Samaroh: ప్రధాని మోదీ ఎమోషనల్- ఆ పాప చెప్పింది విని మాటలు మూగోబోయాయ్!


Also Read: WhiteHat Jr Employees Resign: 800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!

Published at: 12 May 2022 01:45 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.