Utkarsh Samaroh: ప్రధాని మోదీ ఎమోషనల్- ఆ పాప చెప్పింది విని మాటలు మూగబోయాయ్!

ABP Desam   |  Murali Krishna   |  12 May 2022 04:25 PM (IST)

Utkarsh Samaroh: ప్రధాని నరేంద్ర మోదీ.. ఎమోషనల్ అయ్యారు. ఓ పథకానికి సంబంధించిన లబ్ధిదారులతో మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రధాని మోదీ ఎమోషనల్- ఆ పాప చెప్పింది విని మాటలు మూగబోయాయ్!

Utkarsh Samaroh: 

ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో గురువారం వర్చువల్ వేదికలో ముచ్చటిస్తోన్న సమయంలో ఓ యువతి మాటలు విని మోదీ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. 

ఏం జరిగింది?

గుజరాత్ బరూచ్‌లో జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని తన పిల్లలను ఏం చదివించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఆ వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లలో ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంటుందని బదులిచ్చాడు. 

దీంతో ప్రధాని.. ఆ పాపను తాను ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని మోదీ ఎమోషనల్ అయ్యారు.

నా తండ్రికి కళ్లు కనబడవు. నా తండ్రిలా ఎవరూ బాధపడకూడదనే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ అయి అందరికీ సేవ చేస్తాను.                                                    -        పాప

అనంతరం ఆ పాపతో "నీ దయే నీ బలం" అని మోదీ ప్రశంసించారు. 

పథకాల గురించి

ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. తెలుసుకోకపోవడం వల్ల అర్హత లేని వ్యక్తులు ప్రయోజనం పొందుతారని మోదీ అన్నారు. అధికారులు కూడా వీటి గురించి ప్రజలకు వివరించాలన్నారు. 

Also Read: New Chief Election Commissioner: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్- మే 15 నుంచి బాధ్యతల స్వీకరణ

Also Read: WhiteHat Jr Employees Resign: 800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!

Published at: 12 May 2022 01:32 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.