Rajasthan Assembly Election:
నవంబర్ 25కి మార్పు
ఇటీవలే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఛత్తీస్‌గఢ్ మినహా మిగిలిన తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మిగతా అన్ని చోట్లా ఎలాంటి మార్పులు లేకపోయినా..రాజస్థాన్ పోలింగ్ తేదీల్లో (Rajasthan Election Date Change) మాత్రం మార్పులు చేసింది ఈసీ.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీని నవంబర్ 25కి మార్చింది. అదే రోజున రాష్ట్రంలో చాలా పెళ్లిళ్లు,శుభకార్యాలూ ఉన్నాయట. వీటిని దృష్టిలో పెట్టుకుని తేదీలో మార్పు చేసింది.
"నవంబర్ 23న రాష్ట్రంలో భారీ సంఖ్యలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉన్నాయి. వీటి వల్ల ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అంతే కాదు. పోలింగ్ శాతం కూడా తక్కువయ్యే ప్రమాదముంది. అందుకే ఎన్నికల తేదీని నవంబర్ 25కి మార్చుతున్నాం"
- ఎన్నికల సంఘం