Rain Alert: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, సిక్కిం, ఈశాన్య భారతంతో పాటు పలు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అసోం, మేఘాలయ, బిహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘామృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదు అవుతుందని ఐఎండీ వెల్లడించింది. వర్షం పడే అవకాశం తక్కువేనని పేర్కొంది. మరోవైపు తూర్పు ఉత్తప ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో బుధవారం రోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. హెచ్చరించింది. బిహార్ లో 9వ తేదీన, అసోం, మేఘాలయలో ఈరోజు 10,11వ తేదీల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.