Tesla New CFO: టెస్లా ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్కోర్న్ తన పదవీకి విరమణ చేశారు, 13 ఏళ్ల అనుభవజ్ఞుడైన కిర్కోర్న్ CEO ఎలోన్ మస్క్‌కు వారసుడిగా భావించారు. అయితే కిర్కోర్న్ తన నిర్ణయంతో విశ్లేషకులను ఆశ్చర్యపోయేలా చేశారు. కిర్కోర్న్ రాజీనామాతో టెస్లా షేర్లు 3.5% పడిపోయాయి. కిర్కోర్న్ నిష్క్రమణకు కంపెనీ కారణం చెప్పలేదు.
2016లో సోలార్‌సిటీ కోసం $2.6 బిలియన్ల ఒప్పందం ద్వారా టెస్లాలో చేరిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను కిర్కోర్న్ స్థానంలో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. కిర్కోర్న్ నిష్క్రమణతో మస్క్ నేతృత్వంలోని ప్రపంచంలో అత్యంత విలువైన ఆటోమేకర్ వారసత్వంపై ఆందోళన వ్యక్తమైంది. గతంలో అతను స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విటర్) సోషల్ మీడియాలో కీలక పాత్రలు పోషించాడు.
మృదువుగా మాట్లాడే కిర్కోర్న్, అస్థిరమైన మనస్తత్వం ఉండే మస్క్‌కు మధ్య సఖ్యత కుదరలేదు. మస్క్ ఎప్పుడు ఏకపక్షంగా వ్యవహరించేవాడు. విశ్లేషకులతో కాల్‌లో మాట్లాడే సమయంలో, సంస్థ ఉత్పత్తులపై ప్రెజెంటేషన్‌లు, సంస్థ అభివృద్ధి ప్రణాళికలు రచించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఎగ్జిక్యూటివ్‌లలో కిర్కోర్న్ ఒకరు.
ఎలోన్ ఇతర ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ప్రభావవంతమైన అనుసంధాన కమ్యూనికేటర్‌గా కిర్కోర్న్ ఉండేవాడు. అతను సంస్థ నుంచి వెళ్లిపోవడం కష్టమైన విషయం. ఆ లోటు తీర్చడం కష్టమని, సంస్థ కోసం 13 ఏళ్లుకష్టపడ్డాడని టెస్లా పెట్టుబడిదారుడు, గ్లోబాల్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ థామస్ మార్టిన్ అన్నారు.
కిర్కోర్న్ పదవీకాలంలో టెస్లా మోడల్ 3 కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలను టెస్లా ప్రారంభించింది. మొదటి త్రైమాసికంలోనే భారీ లాభాలను నమోదు చేసింది. అంతేకాకుండా $1 ట్రిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ విలువను తాకింది. 2019లో కిర్కోర్న్ సీఎఫ్‌వోగా నియామకం జరిగింది. కాన్ఫరెన్సులో త్రైమాసిక ఫలితాల గురించి మస్క్ మాట్లాడుతూ జాచరీ నియామకాన్ని, దీపక్ ఆహుజా నిష్క్రమణ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
"ఈ కంపెనీలో భాగం కావడం ఒక ప్రత్యేక అనుభవం, 13 సంవత్సరాల క్రితం చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి చేసిన పనికి నేను చాలా గర్వపడుతున్నాను" అంటూ కిర్కోర్న్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తెలిపారు. అయితే అక్కడ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు.
కర్కోర్న్ ఈ సంవత్సరం చివరి వరకు మాత్రమే సంస్థలో ఉండబోతున్నాడు. గత 13 ఏళ్లుగా పని చేస్తున్నాడు. కేవలం వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం వదిలిపెడుతున్నాడు. ఎలోన్ మస్క్‌తో కలిసి పనిచేయడం నిజంగా కష్టమని అతడు భావించాడు." అని డీప్‌వాటర్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామి జీన్ మన్‌స్టర్ చెప్పారు.
2021లో ఎలక్ట్రిక్ ట్రక్కులను సుధీర్ఘ కాలం పాటు పర్యవేక్షించిన అప్పటి ఎగ్జిక్యూటివ్ జెరోమ్ గిల్లెన్ నిష్క్రమించిన తర్వాత కిర్కోర్న్ నిష్క్రమణ కంపెనీలో అతిపెద్ద విషయంగా నిలవబోతోంది. అతని స్థానంలో ప్రస్తుతం ప్రధాన అకౌంటింగ్ ఆఫీసర్‌గా ఉన్న వైభవ్ తనేజా అదనంగా "మాస్టర్ ఆఫ్ కాయిన్" బాధ్యతలు తీసుకుంటాడు.
ఈ ఏదాది టెస్లా కార్ల ధరలను తగ్గించింది. ఇది అమ్మకాలు, మార్కెట్ వాటాకు పెరుగులకు ప్రాధాన్యతనిస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ మార్జిన్‌లను తగ్గించింది. పెరుగుతున్న రుణభారం, ఎలక్ట్రిక్-వాహన తయారీదారుల అమ్మకాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టెస్లా ధరలను తగ్గించింది.
వైభవ్ తనేజా నేపథ్యం
వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పట్టభద్రుడయ్యారు. అకౌంటింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలీ కమ్యూనికేషన్స్ ఎమ్ఎన్‌సీ కంపెనీల్లో పనిచేశారు. 2016లో సోలార్ సిటీని టెస్లా కొనుగోలు చేసిన తరువాత అందులో ఆయన భాగమయ్యారు. 2021లో తనేజా టెస్లా భారతీయ విభాగానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తాజాగా ప్రధాన అకౌంటింగ్ అధికారిగా తన ప్రాథమిక బాధ్యతతో పాటు, ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’ పాత్రను పోషించనున్నట్లు టెస్లా కంపెనీ తెలిపింది.