Rahul Gandhi Wayanad Visit: 



కేరళ పర్యటన..


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళ పర్యటనకు వెళ్లారు. వాయనాడ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత తొలిసారి కేరళకు వెళ్లారు. తన నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు. పరువునష్టం దావా కేసులో ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. 8 ఏళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమూ లేకుండా పోయింది. అయితే...రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేశారు. సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ...అలహాబాద్ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఫలితంగా..రాహుల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు కాపీని లోక్‌సభ స్పీకర్‌కి అందించగా..రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఆ తరవాత ఆయన లోక్‌సభలో రీ ఎంట్రీ ఇచ్చారు. మణిపూర్ అంశంపై ప్రసంగించారు.