Modi Surname Case: 



రాహుల్ ట్వీట్..


పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చగా...ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్‌కి మద్దతుగా ట్వీట్‌లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. 


"నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం ఒక్కటే. ఇండియాను రక్షించడం. ఆ ఐడియాలజీని కాపాడడం"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 






అటు కాంగ్రెస్ క్యాడర్‌లోనూ జోష్ పెంచింది ఈ తీర్పు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు సందడి చేశారు. రాహుల్‌కి శుభాకాంక్షలు చెప్పారు. మిఠాయిలు పంచుకున్నారు. 


 





సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఎస్‌పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. 


"దేశ ప్రజాస్వామ్యంపై, న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిన తీర్పు ఇది. రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే ఇవ్వడం గొప్ప విజయం. బీజేపీ ప్రతికూల రాజకీయాలకు ఈ ఒక్క తీర్పుతో చెక్ పడింది"


- అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి




తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. 


"న్యాయమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ఇకపై రాహుల్ వాయనాడ్‌ ఎంపీగా కొనసాగొచ్చు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ఇలాంటి తీర్పులు ఎంతో అవసరం"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి