Raghav Chadha: ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాఘవ్ చద్దా మరికొందరు ఎంపీలతో కలిసి ఆప్‌కు షాక్ ఇచ్చారు. మొత్తం ఏడుగురు తమకు ఆప్‌తో సంబంధం లేదని బీజేపీ సభ్యులుగా గుర్తించాలని చెబుతూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇది రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురి చేసింది. రాజ్యసభలో సమీకరణాలను మార్చేసింది. ఈ క్రమంలోనే రాఘవ్ చద్దాకు గతంలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. క్లీ టేల్స్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో ఆయన తన ఇంటి వంటగది రహస్యాలను, ఇష్టమైన వంటకాలను, ఆంధ్రా ఫుడ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. 

Continues below advertisement

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే రాఘవ్ చద్దా, తన ఫిట్‌నెస్‌, ఆహారపు అలవాట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులు వచ్చినా, ఆయన ఇష్టపడే అల్మండ్‌ మిల్ మ్యాంగోషేక్‌ మాత్రం మారలేదు. సాధారణంగా వేసవిలో మామిడి పండ్లను తింటాం. కానీ చద్దా అక్టోబర్ నెలలో కూడా ఈషేక్ తీసుకుంటానని చెప్పారు. అంటే ఆ డ్రింక్ అంటే ఆయనకు ఎంత మక్కువో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక హెల్తీ వర్షన్ అని ఆయన గర్వంగా చెబుతుంటారు. 

Also Read: పంజాబ్‌ రాజకీయ తుపాను ఆప్‌ను ముంచేస్తుందా? రాఘవ్‌ చద్దా సహా ఏడుగురి ఎంపీల నిర్ణయంతో ఏం జరగనుంది?

సాధారణంగా మనం మామిడి పండ్ల రసంలో చక్కెర, చిక్కటి పాలు వేసి తాగుతుంటాం. ఇది రుచిగా ఉన్నప్పటికీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ రాఘవ్ చద్దా సూచించిన విధానం హెల్తీ ట్విస్ట్ తో ఉంటుంది. 

Continues below advertisement

ఇందులో సాధారణంగా ఆవు లేదా గేదె పాలకు బదులు బాదం పాలు వేస్తారు. ఇది జీర్ణక్రియను పటిష్టం చేస్తుంది. లాక్టోజ్‌ అలర్జీ ఉన్న వారికి మేలు చేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన చక్కెర వాడరు. మామిడి పండ్లులోని సహజ తీపి సరిపోకపోతే దానికి బదులు తేనె వినియోగిస్తారు. ఇందులో బాదం పప్పుు, జీడిపప్పులను కలపడం వల్ల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. 

ఈ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

ఈ రుచికరమైన షేక్ తయారీకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు బాగా పండిన మామిడి పండ్లు తీసుకోవాలి. ఒక కప్పు చల్లని బాదం పాలు తీసుకోవాలి. గుప్పెడు బాదం, జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ తేనె, మూడు నుంచి నాలుగు ఐస్ క్యూబ్‌లు తీసుకోవాలి. అలంకరణ కోసం పిస్తా లేదా బాదం తురుము వేయవచ్చు. 

Also Read: కేజ్రీవాల్‌కు ఊహించని షాక్- బీజేపీలో విలీనమైన రాజ్యసభ సభ్యుల బృందం - హర్భజన్ కూడా!

తయారీ విధానం

మొదట మామిడి పండ్లను శుభ్రంగా కడిగి పీచు లేకుండా తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి. ఒక బ్లెండర్‌ జార్ తీసుకొని అందులో మామిడి ముక్కలు, చల్లని బాదం పాలు, బాదం పప్పులు, జీడి పప్పులు వేయాలి. మీకు కావాల్సిన తీపిని బట్టి తేనె , ఐస్ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా క్రీములా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. ఒక గాజుగ్లాస్‌లో తీసుకొని పైన పిస్తా పప్పులు, లేదా బాదం పలుకులుతో గార్నిష్ చేయాలి. 

ఆరోగ్య ప్రయోజనాలు 

ఈ మ్యాంగో షేక్ తీసుకోవడం వల్ల తక్కువ కేలరీలు లభిస్తాయి. బాదంాలలో డైర మిల్క్‌ తక్కువ కేలరీలు ఉంటాయి ఇది బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. మామిడి పండ్లలో విటమిన్ ఏ, సీ, బాదం పాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నట్స్ మామిడి పండులోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని ఇస్తాయి. 

రాఘవ్ చద్దా ఒకసారి ఢిల్లీలో ఉన్న ఆంధ్రభవన్‌లో భోజనం చేశారు. అక్కడ లభించే ఆంధ్రా భోజనం రుచి చూశారు. ఇలా సింపుల్‌గా ఉండే భోజనం ఇష్టమని చెప్పుకొచ్చారు.