బెంగళూరులో విపక్షాలు సమావేశంపై ప్రధానమంత్రి మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ఆరోపణలు చేశారన్నారు. అండమాన్ నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ యూపీఏ పాలన, విపక్షాల భేటీలపై సెటైర్లు పేల్చారు. 


విపక్షాలు సొంత లాభం కోసమే పని చేస్తున్నాయని ఆరోపించారు మోదీ. 9 ఏళ్లల్లో తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అండమాన్‌నికోబార్‌ దీవుల్లో ఏర్పాటు చేసిన కొత్త టెర్మినల్‌ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇలా దేశంలోని ఏ మూలకు వెళ్లినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు మోదీ. 


గత యూపీఏ పాలనలో అభివద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు మోదీ. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తంటాయని వారిని కాపాడుకోవడమే వారి ప్రధాన లక్ష్యం అన్నారు. బెంగళూరు, పాట్నాలో విపక్షాల సమావేశాలను నేరుగా ప్రస్తావించకుండానే వారిపై ఆరోపణలు చేశారు. 


అభివృద్ధి కాకుండా కుటుంబాలను కాపాడుకోవడానికే కొన్ని పార్టీ పని చేస్తుంటాయని వారి తాపత్రయం కూడా అదేనని అన్నారు మోదీ. తాము మాత్రం దేశం కోసం ఆలోచిస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.