Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురువారం చెన్నైకి వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా వారిని కోరారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ముర్ము ప్రచారం
మరోవైపు ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 2న చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. భాజపా మిత్రపక్షాలను కలుసుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరనున్నారు.
వైరల్ ఫొటో
ఈ ఫొటోలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ఉన్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న వినోబా భావే యూనివర్సిటీలో జరిగిన 7వ స్నాతకోత్సవానికి సంబంధించిన ఫొటో ఇది.
ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు ప్రస్తుత ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. దీంతో యూనివర్సిటీ చాన్స్‌లర్ హోదాలో ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రస్తుతం విపక్షాల తరఫున రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా గౌరవ డి.లిట్ డిగ్రీ అందుకున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వీరిద్దరూ ఉండటంతో ఫొటో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు.
Also Read: Rare Pic: ఒకే వేదికపై యశ్వంత్ సిన్హా, ద్రౌపది ముర్ము- వైరల్ పిక్ చూశారా?
Also Read: Sharad Pawar: 'నాకూ ఓ లవ్ లెటర్ వచ్చింది'- ఐటీ శాఖ నోటీసులపై పవార్ పవర్‌ఫుల్ పంచ్!