Presidential Election 2022: రాష్ట్రపతి రేసు నుంచి గోపాలకృష్ణ గాంధీ ఔట్- విపక్షాల ఆఫర్‌కు నో!

ABP Desam Updated at: 20 Jun 2022 05:20 PM (IST)
Edited By: Murali Krishna

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు.

రాష్ట్రపతి రేసు నుంచి గోపాలకృష్ణ గాంధీ ఔట్- విపక్షాల ఆఫర్‌కు నో!

NEXT PREV

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాల్‌కృష్ణ గాంధీ పేరు ఇప్పటికే వినిపించింది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్‌కృష్ణ గాంధీ.. ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఆయన పోటీలో నిలపాలనే ప్రతిపాదనను మమతా బెనర్జీ, వామపక్ష పార్టీలు చేశాయి.


ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరిన గోపాలకృష్ణ గాంధీ.. తాజాగా ఇందుకు నిరాకరించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.



రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాను. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించిన వారందరికీ నా కృతజ్ఞతలు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంతో మంది సీనియర్ నేతలు నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారు. వారందరికీ నేను కృతజ్ఞుడిని. కానీ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన తరువాత, ప్రతిపక్షాల అభ్యర్థి జాతీయ ఏకాభిప్రాయాన్ని, ప్రతిపక్ష ఐక్యతతో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించే వ్యక్తిగా ఉండాలని నేను భావిస్తున్నాను. నా కంటే మెరుగ్గా ఈ పని చేసేవాళ్లు ఇంకా ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నేను ప్రతిపక్ష నేతలను అభ్యర్థించాను.                                                    -   గోపాలకృష్ణ గాంధీ


గతంలో


ఐఏఎస్‌, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్‌కృష్ణ గాంధీ.. గతంలో బంగాల్ గవర్నర్‌గా  కూడా పని చేశారు.  2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్‌ గాంధీ పోటీ చేశారు. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు.


మరి ఎవరు?


భాజపాయేతర పార్టీలన్నీ ఏకమై ఉమ్మడి రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ జాబితాలో చాలా మంది పేర్లే వినిపించాయి. మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీతో పాటు ప్రధానంగా అందరి నోటా వినిపించిన పేరు ఫరూక్ అబ్దుల్లా. లోక్‌సభ ఎంపీగా, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లాకి మంచి రాజకీయ అనుభవముందని, ఆయననే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రతిపాదించారు. అయితే ఫరూక్ అబ్దుల్లా ఇందుకు భిన్నంగా స్పందించారు. ఈ పోటీలో నిలబడాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. ఆ జాబితాలో నుంచి తన పేరు తొలగించాలని ప్రతిపక్షాలను కోరినట్టు వెల్లడించారు. 


Also Read: Viral Video: మీరు నిజమైన హీరో సర్- చేతులతో డ్రైనేజీ క్లీన్ చేసిన ట్రాఫిక్ పోలీస్!


Also Read: Cable Car Mishap: రోప్‌వే పై నిలిచిపోయిన కేబుల్ కార్- ఇలా చిక్కుకుపోయారేంటి!

Published at: 20 Jun 2022 05:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.