Congress Chief: కాంగ్రెస్‌లో తిరిగి జవసత్వాలు రావాలన్నా, పార్టీ మళ్లీ గెలుపు బాట పట్టాలన్నా.. పగ్గాలను ప్రియాంక గాంధీకే ఇవ్వాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. సోనియా గాంధీకి చెప్పారట. ప్రస్తుతం ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు వారాల వాడివేడి చర్చ అనంతరం కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. అసలు దీనికి కారణం ఏంటంటే?


ఫ్రీ హ్యాండ్ కావాలి


పార్టీని పునరుద్ధరించేందుకు అవసరమైన స్వేచ్ఛ, సీనియర్ హోదాను ప్రశాంత్ కిశోర్ ఆశించారు. అయితే ఇందుకు భిన్నంగా ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో సభ్యుడిగా ఉండాలని అధిష్ఠానం ప్రతిపాదించడం, దానికి  ఆయన తిరస్కరించడంతో కాంగ్రెస్‌లో పీకే చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.


పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, తనకంటే కూడా పార్టీలో లోతుగా వేళ్లూనుకున్న సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం, సమష్టి కృషి కాంగ్రెస్‌కు ఇప్పుడు చాలా అవసరమనే అభిప్రాయాన్ని పీకే వ్యక్తం చేశారు.






ఆ రెండు


పార్టీలో సంస్థాగత మార్పులు జరగాలని పీకే సూచించారు. పీఎం అభ్యర్థిగా ఒకరు, పార్టీ చీఫ్‌గా మరొకరు... అంటే రెండింటికీ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉండాలనేది ఆయన ప్రధాన సూచన. కాంగ్రెస్‌కు ప్రియాంక గాంధీ సారథ్యం (పార్టీ చీఫ్) వహించాలని పీకే సూచించారట. అయితే పార్టీ నేతలు మాత్రం మరోసారి కాంగ్రెస్ చీఫ్‌ పగ్గాలు రాహుల్‌కు అప్పగించడానికే మొగ్గుచూపారని చెబుతున్నారు.


Also Read: Weather Impact on Indian Economy: ఎంత పని చేశావ్ సూరీడు- నీ వల్ల గంటకు రూ.5 వేల కోట్లు నష్టం!


Also Read: Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !