G20 Summit In Rio de Janeiro Brazil:  రియోడిజనిరో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం అయ్యారు. G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వీరిద్దరూ బ్రెజిల్ పర్యటనకు వెళ్లారు. రాజధాని రియోడీజనిరోలో నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీ, అమెరికా ప్రధాని బైడెన్ ప్రత్యకంగా భేటీ అయ్యారు. రియోడిజనీరోలో జో బైడెన్‌ను కలిశాను. అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


భారత్‌లో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్


జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించింది. గ్లోబల్ సౌత్  ఆశలు, ఆకాంక్షలకు ఇది రెక్కలు తొడిగిందన్నారు. ‘మొదటి  సెషన్ థీమ్‌లో భారతదేశ విజయగాథల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత 10 ఏళ్లలో 250 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. మా ప్రభుత్వం దేశంలో 800 మిలియన్లకు (80 కోట్లు) పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం (Health Scheme) ద్వారా 550 మిలియన్ల మంది లబ్ధి పొందుతున్నారు’’ అని వివరించారు.






ఉచిత ఆరోగ్య బీమా


భారత్‌లో ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన 60 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్నాం. దేశంలో మహిళా నాయకత్వం పెరగడంపై దృష్టి సారించాం. 300 మిలియన్లకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారం చేస్తున్నారు అని ప్రధాని మోదీ తెలిపారు.



బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు మొదట సింగపూర్ కౌంటర్ లారెన్స్ వాంగ్, యూఎన్ జనరల్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో సమావేశమయ్యారు. నైజీరియాలో పర్యటన ముగించుకుని బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తరువాత అక్కడి ప్రవాస భారతీయులకు కొంత సమయం కేటాయించారు. వారిని పలకరించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లోని ప్రవాస భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీని సంస్కృత శ్లోకాలు పాడుతూ ఘన స్వాగతం పలికారు.