PM Modi Speech: విజ్ఞాన శాస్త్రంలో భారత దేశాన్ని ఆత్మ నిర్భర్ గా మార్చాలంటూ ప్రధాని మోదీ ఇండియన్ కాంగ్రెస్ సదస్సులో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత్ సైన్ కాంగ్రెస్ 108వ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాదోజీ మహారాజ్ నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో భారత సైన్స్ కాంగ్రెస్ 108వ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రయోగ శాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని తెలిపారు. 






ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయ మిల్లెట్స్(తృణ ధాన్యాల) సంవత్సరంగా ప్రకటించిందని, భారత దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిని సైన్స్ వినియోగంతో మరింత పరచాలంటూ ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం సైన్స్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత దేశంలో మనకు రెండు విషయాలు కనిపించాయని అవి డేటా, టెక్నాలజీ అని వివరించారు. ఇవి భారత విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని అన్నారు. డేటా విశ్లేషణ వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఇది సమాచారాన్ని అంతర్దృష్టిగా, విశ్లేషణను కార్యాచరణ జ్ఞానంగా మార్చడంలో సహాయ పడుతుందని ప్రధాని మోదీ అన్నారు.






సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలవడం గర్వ కారణమని తెలిపారు. ప్రస్తుతం స్టార్టప్ లలో భారత దేశం ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉందని ప్రధాని మోదీ వివరించారు. 2015 వరకు 130 దేశాల గ్లోబల్ ఇన్నోవేషన్ ఉండెక్స్ లో 81వ స్థానంలో ఉన్నామని.. కానీ 2022లో 40వ స్థానానికి చేరుకున్నామని 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఆత్మనిర్భర్ గా మార్చి మరింత అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. నూతన ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపు నిచ్చారు.