భారత జీ-20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధానినరేంద్ర మోదీ మంగళవారం (నవంబర్ 8) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. డిసెంబర్ 1 నుంచి జీ-20కి భారత్ అధ్యక్షత వహిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక సందర్భం అన్నారు. అందువల్ల, ఈ సదస్సు వెబ్ సైట్, థీమ్, లోగో ఆవిష్కరించారు. ఈ 
సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలు తెలుపారు ప్రధాని. లోగోలో ఉన్న తామర పువ్వు పౌరాణిక వారసత్వాన్ని గుర్తుగా వివరిచారు. 


జి-20 అనేది ప్రపంచ జిడిపిలో 85% ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల సమూహం. జి-20 అనేది 20 దేశాల సమూహం, ఇది ప్రపంచ వాణిజ్యంలో 75% ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం ఇప్పుడు ఈ జి-20 సమూహానికి నాయకత్వం వహించబోతోంది.






"వసుధైవ కుటుంబకానికి ప్రాతినిధ్యం వహించే లోగో"


జి-20 భారత దేశం లోగో 'వసుధైవ కుటుంబకమ్' అనే అర్థాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి అన్నారు. జి-20 ఈ లోగో కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని... ఇది ఒక సందేశమని అభిప్రాయపడ్డారు. ఇది మన ఆలోచనలో తీరుకు నిదర్శనమని వివరించారు. ఈ లోగో, థీమ్ ద్వారా ప్రపంచానికి ఓ సందేశాన్ని ఇస్తున్నామన్నారు. జి-20 నిర్వహణతో ప్రపంచ ఖ్యాతికి కొత్త శక్తిని భారత్‌ ఇవ్వబోతోందని కామెంట్ చేశారు. జి-20 లోగోలోని తామర చిహ్నం ఆశను సూచిస్తుంది.


ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే?


జి-20కు భారత్‌ అధ్యక్షత వహించబోతున్న టైంలో ఈ కార్యక్రమం 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని అన్నారు. నేడు ఆరోగ్యం కోసం ప్రపంచమంతా చికిత్సకు బదులుగా మన ఆయుర్వేదం, యోగా వైపు చూస్తున్నాయని తెలిపారు. 


ప్రపంచంలో వర్గాలు ఉండకుండా ఒకే ఒక ప్రపంచం ఉండాలన్నదే భారత్‌ ప్రయత్నం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అనే మంత్రంతో ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన విప్లవానికి భారతదేశం పిలుపునిచ్చింది. ఒకే భూమి, ఒకే ఫ్యామిలీ, ఒకే భవిష్యత్‌  అనే మంత్రంతో ప్రపంచ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రచారాన్ని ప్రారంభించింది.