Viral News: విమాన ప్రయాణ సమయంలో చాలా మంది ప్రయాణికులు తమ లగేజీ గురించి ఎక్కువ కంప్లెయింట్ చేస్తుంటారు. ఎందుకంటే విమానయాన సిబ్బంది.. తమ లగేజీని జాగ్రత్తగా సరఫరా చేయడం లేదని, డ్యామేజ్ అవుతున్నాయని చాలా మంది పాసింజర్లు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత తన బ్యాగ్ పరిస్థితి చూడండి అంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.


ఇదీ సంగతి


ఆ పాసింజర్ షేర్ చేసిన ఫొటోలో ట్రోలీ పూర్తిగా డ్యామేజ్ అయింది. చిత్రంలో ఎరుపు రంగు సూట్‌కేస్ పూర్తిగా చిరిగిపోయినట్లు కనిపిస్తోంది. రెడ్డిట్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ "విమాన ప్రయాణం తర్వాత అంకుల్ సూట్‌కేస్ పరిస్థితి" ఇది అని ఆ వ్యక్తి ట్యాగ్ చేశాడు. అయితే ఆయన అంకుల్ ప్రయాణించిన విమానం, ఏ విమానయాన సంస్థలో ప్రయాణించారో అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



సాధారణంగా విమాన ప్రయాణం అంటేనే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అయితే వీటికి అనుగుణంగా ప్రయాణికులు నడుచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లగేజి రూపంలో ఒక్క బట్టలు తప్ప, మరేవీ పట్టుకెళ్ళకూడదు. కొంతవరకు లగేజీని మాత్రం విమాన సిబ్బంది చాలా జాగ్రత్తగా కేరీ చేస్తారు.


అయితే అనేక నిబంధనలు విధిస్తున్న విమాన సిబ్బంది ప్రయాణికుల లగేజీ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Watch Video: నడిరోడ్డుపై మహిళను చితకబాదిన యువతులు- వైరల్ వీడియో!