Rajasthan News: ప్రేమ కోసం 'అతడు'గా మారిన ఆమె- ఇదో జంబలకడిపంబ కథ!

ABP Desam   |  Murali Krishna   |  08 Nov 2022 05:47 PM (IST)

Rajasthan News: ప్రేమ కోసం ఆ యువతి ఏకంగా పురుషుడిగా మారింది. ఈ వింత ప్రేమ కథ గురించి తెలుసుకుందామా?

(Image Source: ANI)

Rajasthan News: కులం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా ప్రేమ కోసం వాటన్నింటినీ పక్కన పెట్టిన జంటలను మనం చూసే ఉంటాం. కానీ ఓ జంట మాత్రం అంతకన్నా పెద్ద సాహసమే చేసింది. ఆమె ప్రేమను పొందటానికి ఓ యువతి.. 'అతడు'గా మారింది. ఇదేంటి అని షాకవుతున్నారా? అవును ఇది నిజం.

ఇదీ జరిగింది

రాజస్థాన్‌కు చెందిన కుంతల్‌ అనే యువతి ఓ కళాశాలలో పీఈటీ టీచర్‌గా పని చేసేది. అయితే తన విద్యార్థిని కల్పనా ఫౌజ్దార్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. కల్పనా.. ఓ కబడ్డీ ప్లేయర్. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ‍ ప్రేమగా మారింది. కానీ సమాజం ఏమనుకుంటుంది? దీని గురించి ఎలా చెప్పాలి? అని కుంతల్ ఆలోచించింది.

చివరికి కుంతల్.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకుంది. 2019లో సర్జరీ చేయించుకుని అతడుగా మారింది. ఆ తర్వాత ఆ టీచర్‌ తన పేరుని ఆరవ్‌గా మార్చుకుంది. తన కోసం ఇంత సాహసం చేసిన కుంతల్‌ను కల్పన పెళ్లి చేసుకుంది.

నాకు మొదటి నుంచి ఆమె (కుంతల్) అంటే ఇష్టం. అయితే సర్జరీ చేయించుకోకపోయినా నేను ఆమెనే పెళ్లి చేసుకునే దాన్ని. కానీ నా కోసం ఆమె ఇంత సాహసం చేసింది. సమాజం ఏమనుకున్నా సరే మా విహహం విరుద్ధమైనా సరే, మా తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. మేం ఆనందంగా ఉంది.  -                                           కల్పన

పురుషుడిగా మారడానికి నేను శస్త్రచికిత్స చేయించుకోవాలని ఎప్పుడో అనుకున్నాను. కానీ ఇలా చేస్తే ఆమె ఎలా అనుకుంటోందో అర్థం కాలేదు. కానీ చివరికి ఇందుకు ఆమె సరే అంది. 2019 డిసెంబర్‌లో నాకు మొదటి సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఆమె నాతోనే ఉంది.                       -       ఆరవ్ కుంతల్, పీఈటీ టీచర్

Also Read: Viral News: ఇంత నిర్లక్ష్యమా? ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ బ్యాగ్ పరిస్థితి ఇదీ!

Published at: 08 Nov 2022 05:42 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.