PM Modi Speech:


లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం మొదలు పెట్టారు. ఎన్నో రోజులుగా మణిపూర్‌పై పార్లమెంట్‌లో మోదీ చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రధాని లోక్‌సభకు హాజరయ్యారు. 2018లోనూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని గుర్తు చేసిన ప్రధాని మోదీ...ఈ సారి కూడా తీర్మానం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, ప్రతిసారీ ఇది రుజువైందని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు.