Owaisi To PM Modi: 'మోదీ సాబ్, అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి- మీ కథ ఏంటో తేల్చెద్దాం'

ABP Desam Updated at: 20 Jun 2022 05:37 PM (IST)
Edited By: Murali Krishna

Owaisi To PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సవాల్ చేశారు. ఇటీవల మోదీ చెప్పిన కథ గురించి ప్రశ్నించారు.

'మోదీ సాబ్, అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి- మీ కథ ఏంటో తేల్చెద్దాం'

NEXT PREV

Owaisi To PM Modi: మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకుపై ప్రధాని నరేంద్ర మోదీని ఎమ్ఐఎమ్ అధినే అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విమర్శించారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమో కాదా అనేది మోదీ తన చిన్ననాటి మిత్రుడిగా చెప్పుకుంటున్న అబ్బాస్‌ను అడగాలని సవాల్ చేశారు.


ఇదీ కథ


మోదీ తన తల్లి హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాగ్‌ పోస్ట్‌లో అబ్బాస్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.



మా తండ్రిగారి సన్నిహత మిత్రుడు ఒకరు మా పక్క గ్రామంలో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత మా నాన్నగారు తన మిత్రుడి కొడుకుని ఇంటికి తీసుకువచ్చారు. అతను మాతోనే ఉండి చదువుకున్నాడు. అబ్బాస్‌ను మా అమ్మ ఎంతో ప్రేమగా చూసుకునేది. మమ్మల్ని కవలలుగా చూసేది. ఏటా ఈద్ రోజు అబ్బాస్‌కు ఇష్టమైన వంటకాలను అమ్మ చేసిపెట్టేది.                                                   -     ప్రధాని నరేంద్ర మోదీ


ఓవైసీ సవాల్


మోదీ ఆ బ్లాగ్‌లో చెప్పిన ఈ అంశంపై ఓవైసీ పలు ప్రశ్నలు వేశారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమో కాదో తన స్నేహితుడు అబ్బాస్‌ను మోదీ అడగాలని సవాల్ చేశారు.



ప్రధానికి ఎనిమిదేళ్ల తర్వాత తన మిత్రుడు గుర్తుకొచ్చాడు. ఇలాంటి మిత్రుడు మీకు ఉన్నాడని మాకు తెలియదు. మేం ప్రధానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అబ్బాస్‌కు ఫోను చేసి అసదుద్దీన్ ఒవైసీ, ఉలేమాలు మతపెద్దలు చేసిన ప్రసంగాలు వినిపించండి. మేము అబద్ధాలు ఆడుతున్నామా అనేది అడిగి తెలుసుకోండి. మీరు మీ  ఫ్రెండ్ అడ్రెస్ చెప్పినా చాలు. నేనే వెళ్లి అబ్బాస్‌ను కలుస్తాను. మహమ్మద్ ప్రవక్తపై నుపర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేవా అనే విషయం నేనే అడుగుతాను. ఆయన ఏమంటారో చూద్దాం.                                                    -   అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్ఐఎమ్ అధినేత


Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి రేసు నుంచి గోపాలకృష్ణ గాంధీ ఔట్- విపక్షాల ఆఫర్‌కు నో!


Also Read: Viral Video: మీరు నిజమైన హీరో సర్- చేతులతో డ్రైనేజీ క్లీన్ చేసిన ట్రాఫిక్ పోలీస్!

Published at: 20 Jun 2022 05:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.