RSS Chief Mohan Bhagwat: సంఘ్ కార్యకర్తలు, సభ్యులు ఎప్పటికీ దేశం కోసం పనిచేస్తారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ స్వయంసేవక్, ప్రచారక్ గా పనిచేస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావనకు వస్తే చాలా మంది ప్రధాని మోదీ ( PM Narendra Modi )ను తెరమీదకు తెస్తారని గుర్తు చేశారు. దేశంలో మతతత్వం అనగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారని, కానీ ఎవరూ మతతత్వాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం లేదన్నారు. అయితే హిందూత్వం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాలు తెలుసుకుంటే చాలన్నారు.


ఇప్పుడు చెబుతున్నానంటూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ స్వయంసేవక్, ప్రచారక్ గా సేవలు అందిస్తున్నారని మోహన్ భగవత్ తెలిపారు. జబల్‌పూర్‌లో శనివారం జరిగిన ఈవెంట్లో సైతం ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. స్వయంసేవక్‌లు విశ్వహిందూ పరిషత్‌ను నడిపిస్తున్నారని చెప్పారు. కానీ సంఘ్ సభ్యులను నేరుగా గానీ, పరోక్షంగాగానీ వారిని నియంత్రించడదన్నారు. అయితే ఆయా సంస్థలు స్వతంత్రంగా వాటి పనులు, బాధ్యతలు నిర్వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ తో సంప్రదింపులు జరిపితే సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుందని వీహెచ్‌పీని, స్వయంసేవక్ లను కంట్రోల్ చేయాలని మాత్రం ప్రయత్నించే ప్రసక్తే లేదన్నారు.


భోపాల్ లో ఒక సమావేశంలో మాట్లాడుతూ అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపుడైతే సంఘ్ పేరు వినిపిస్తోందో అందరూ ప్రధాని మోదీకి లింక్ చేసి మాట్లాడుతున్నారని.. ఏది ఏమైనప్పటికీ ప్రధాని మోదీ సంఘ్ స్వయంసేవక్ గా, ప్రచారక్ గా ఇప్పటికీ పని చేస్తున్నారని పునరుద్ఘాటించారు. సంఘ్ కేవలం సలహాలు, సూచనలు ఇస్తుంది తప్ప వారిని నియంత్రించదని అన్నారు.భారతదేశం అనేది కేవలం ఓ మతం ద్వారానో, వ్యాపారం, రాజకీయ శక్తులు, ఆలోచనతోనో దేశంగా మారలేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబం అన్న అంశాలతో భారతదేశం ఏర్పడిందని ఎందరో ప్రముఖులు, మేధావులు హాజరైన కార్యక్రమంలో చెప్పారు. కేవలం ఒక్క వ్యక్తి వల్లనో, సంస్థ కారణంగానో, రాజకీయ పార్టీ కారణంగా భారీ మార్పులు సంభవించే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. 


హిందుత్వం అందరినీ ఆదరించే తత్వం
హిందుత్వం అంటే మతం కాదు అనీ, అందర్నీ ఆదరించే తత్వం అని, భారత రాజ్యాంగ ప్రవేశిక కూడా హిందుత్వపు ప్రధాన స్ఫూర్తితో రూపొందించారు. ధర్మం అంటే మతం, పూజించే విధానం కాదని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించే మార్గాన్ని సూచిస్తుందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. నీటి నిల్వల్ని పెంచుకోవాలని, చెట్లను పెంచడం ద్వారా ప్రకృతికి కాపాడుకుని ప్రయోజనాలు పొందాలన్నారు.


సమాజ నిర్మాణం
భాషా, పూజించే విధానం సమాజాన్ని నిర్మించలేవని, ఉమ్మడి లక్ష్యాలు కలిగి ఉన్న వ్యక్తులు సమాజాన్ని నిర్మిస్తారని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. వైవిధ్యాన్ని ఎప్పుడూ స్వాగతించాలని, వివక్షకు తావివ్వకూడదని సూచించారు. 
Also Read: ఛత్రపతి శివాజీ ఒకప్పటి ఐకాన్, గాంధీ, గడ్కరీయే గొప్ప వ్యక్తులు - మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు