న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం (10 ఆగస్టున) సోషల్ మీడియా దిగ్గజం మెటాకు నకిలీ ప్రొపగాండాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ వార్తలను ఆపడానికి అవసరమైతే తమ అల్గోరిథమ్ (Algorithm)లో కూడా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు సూచిస్తుంది.
కేంద్రం సూచనల ప్రకారం, సోషల్ మీడియాలో ఏం, ఎంత మేరకు వైరల్ అవుతుందో నిర్ణయించే మెటా అల్గోరిథమ్‌ను మార్చడంపై కేంద్రం ఫోకస్ చేసింది. తద్వారా నకిలీ ప్రొపగాండా వ్యాప్తి జరగకుండా ఉంటుంది. డీప్‌ఫేక్, నకిలీ ప్రొపగాండా తమ బాధ్యత అని, దానికి అల్గోరిథమ్‌లో మార్పులు అవసరమైతే అవి చేయాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు చెప్పింది.
వ్యవస్థ నకిలీ కంటెంట్‌ను గుర్తించి అడ్డుకోవాలి - మోదీ ప్రభుత్వం
వాస్తవానికి, అల్గోరిథమ్ (Algorithm) అనేది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ పోస్ట్ మీకు ఎక్కువగా కనిపించాలి. ఏది తక్కువ మందికి చేరాలన్నది నిర్ణయించే వ్యవస్థ. అందుకే మోదీ ప్రభుత్వం ఈ వ్యవస్థ నకిలీ, భ్రమ కల్పించే కంటెంట్‌ను ప్రోత్సహించకుండా, అలాంటి గుర్తించి అడ్డుకోవాలని కోరుతోంది.
కంటెంట్ మోడరేషన్ (Content Moderation)ను కూడా బలోపేతం చేసి, దానికి సరైన రోడ్‌మ్యాప్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం Metaను కోరింది. అలాగే, తప్పు కంటెంట్‌ను గుర్తించి దానిపై చర్యలు తీసుకునే వ్యవస్థను పటిష్టం చేయాలని కూడా మెటాకు చెప్పింది.
మోదీ ప్రభుత్వం మెటాకు ఏఏ ఆదేశాలు ఇచ్చింది?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ మెటాకు డీప్‌ఫేక్ (Deepfake), మార్ఫ్‌డ్ ఫోటో- వీడియోలను గుర్తించేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సూచించింది. చట్టవిరుద్ధ కంటెంట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
డేటా లోకలైజేషన్ (Data Localisation) నిబంధనలను పాటించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కంటెంట్ తొలగింపులో వేగంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. అలాగే, ప్రభుత్వంతో మెరుగైన సమన్వయం ఉండాలని మెటాకు చెప్పింది.
Also Read: Jharkhand Students Protest:జార్ఖండ్ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
