Lata Deenanath Mangeshkar Award : దివంగత లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి మోదీ ముంబయిలో స్వీకరించారు. దేశానికి నిస్వార్థ సేవలు అందించిన ప్రధానికి ఈ అవార్డు ప్రదానం చేశారు. 92 ఏళ్ల సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటుచేశారు. లతా మంగేష్కర్ ఈ ఏడాది ప్రారంభంలో అస్వస్థతతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ తొలి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్న ప్రధాని దివంగత లతా మంగేష్కర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. లతా దీదీ తనకు పెద్దక్క వంటిందన్నారు. ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం అన్నారు. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుందన్న ప్రధాని, లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేదన్నారు.
దేశ ప్రజలందరికీ అంకితం
సింగింగ్ లెజెండ్ మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ తండ్రి, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 80వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును భారతీయులందరికీ అంకితమిస్తున్నానని ఆయన తెలిపారు. "లతా దీదీ వంటి అక్కలాంటిది. ఈ అవార్డు ఆమెకు నాపై ఉన్న ప్రేమకు చిహ్నం. అందుకే ఈ అవార్డును నేను అంగీకరించకుండా ఉండటం సాధ్యం కాదు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నాను" అని ప్రధాని అని మోదీ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించిన లతా మంగేష్కర్ గౌరవార్థం ఈ సంవత్సరం నుంచి అవార్డును స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకటించింది.
మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
దేశం కోసం అసాధారణమైన విజయాలు సాధించిన మహోన్నత వ్యక్తి లతా దీనానాథ్ మంగేష్కర్ అని ప్రధాని అన్నారు. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులు సంగీతం, నాటకం, కళ, వైద్యం, సామాజిక సేవ రంగానికి చెందిన దిగ్గజాలను గౌరవించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. "గాయకుడిగా, సంగీత విద్వాంసుడిగా, రంగస్థల కళాకారుడిగా స్మారక సేవలను అందించిన మాస్టర్ దీనానాథ్‌జీ జ్ఞాపకార్థం మహారాష్ట్ర, భారతదేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మంగేష్కర్ కుటుంబం, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ అవార్డులను నిర్వహిస్తుంది." అని ప్రముఖ సంగీత విద్వాంసులు హృదయనాథ్ మంగేష్కర్, ఉషా మంగేష్కర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.