PM Modi Flies in Tejas Aircraft:
తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి వెళ్లిన ఆయన తేజస్ ఫైటర్ జెట్‌ని పరిశీలించారు. ప్రస్తుతం HALలోనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారవుతున్నాయి. ఈ పనులను రివ్యూ చేసేందుకు వెళ్లిన మోదీ ఇలా పైలట్ వేషధారణలో కనిపించారు. అక్కడి వాళ్లలో ఉత్సాహం నింపారు. దేశీయంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం ఆ మేరకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది. నిధులూ కేటాయిస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ అనే కలను సాకారం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. light combat aircraft అయిన Tejas Fighter Jets ని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా రక్షణశాఖకు చెందిన GE Aerospace కంపెనీ HALలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. Mk-II-Tejas ఎయిర్‌క్రాఫ్ట్‌లకి ఇంజిన్‌లు తయారు చేసేందుకు డీల్ కుదిరింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్లినప్పుడు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఇటీవలే భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు రూ.15,290 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఇప్పటి వరకూ భారత్ ఈ ఫీట్‌ని సాధించలేదని స్పష్టం చేశారు.
"తేజస్ ఫైటర్ జెట్‌లో ఇప్పుడే ప్రయాణించాను. ఇది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. దేశీయంగా మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసుకోగలం అన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. దేశ సామర్థ్యాన్ని పెంచుకోగలం అన్న నమ్మకం వచ్చింది. ఇదంతా శ్రమ, అంకింతభావంతోనే సాధ్యమైంది. ఆత్మ నిర్భరతలో ప్రపంచంలో ఏ దేశానికీ మనం తీసిపోం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్,DRDO,HALతో పాటు భారతీయులందరికీ అభినందనలు"
- ప్రధాని నరేంద్ర మోదీ
మోదీ హయాంలో రూ.36,468 కోట్లతో HALతో డీల్ కుదిరింది. 83 LCA Mk 1A ఎయిర్‌క్రాఫ్ట్‌లు డెలివరీ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరే చేయనుంది HAL.
Also Read: Halal Ban in India: హలాల్ నిషేధంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు - అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply