న్యూఢిల్లీ: త్వరలో కేంద్ర మంత్రివర్గంతో పాటు బీజేపీ సంస్థాగత నిర్మాణంలో పెద్ద ఎత్తున మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఉత్తరాదిన పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూన్ 23న) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. 2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో తమ పట్టును బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగానే బీజేపీ కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

Continues below advertisement

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడం, ఆయనను మళ్లీ ఎగువ సభకు పంపకూడదని నిర్ణయించడంతో కేంద్ర కేబినెట్‌లో కేరళ ప్రాతినిధ్యంపై కొత్త చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో కేరళకు మరో అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేరళ నుంచి ఉన్న ఏకైక బీజేపీ మంత్రి, నటుడు సురేష్ గోపి మాత్రమే. ఆయన త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 

పంజాబ్ రాజకీయాల్లోకి తిరిగి రానున్న బిట్టూబుధవారం (జూన్ 24న) కేంద్ర కేబినెట్ భేటీ కానుందని, ఆ తర్వాత మంత్రుల శాఖల మార్పు లేదా కొత్త వారికి కేబినెట్ లోకి తీసుకోవడంపై  ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూలను బీజేపీ మళ్లీ రాజ్యసభకు పంపలేదు. మరోవైపు బిట్టూ ఇంకా రాజీనామా చేయలేదు. అయితే, తాను పంజాబ్ రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Continues below advertisement

Also Read: Ujjain Land Scam: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం - సీఎం మోహన్ యాదవ్ ఫ్యామిలీ ల్యాండ్ స్కామ్? రూ. 45 కోట్ల భూముల వెనుక మాస్టర్ ప్లాన్!

యూపీపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్

'ఒక వ్యక్తి, ఒకే పదవి' బీజేపీ రూల్ పాటించడం ద్వారా మరో ఇద్దరు మంత్రులకు పదవీగండం ఉంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన హర్ష్ మల్హోత్రా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీజేపీ నిబంధనల ప్రకారం పంకజ్ చౌదరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో, గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం పంకజ్ చౌదరి స్థానంలో మరో ఓబీసీ లేదా దళిత నేతకు.. ముఖ్యంగా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారికి మోదీ కేబినెట్‌లో చోటు కల్పించవచ్చు. సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్‌ల PDA (వెనుకబడిన, దళిత, మైనారిటీ) ఫార్ములాను తిప్పికొట్టేందుకు బీజేపీ ఈ మార్పుల ద్వారా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి యూపీలో సోషల్ బ్యాలెన్స్ సాధించాలని చూస్తోంది.

Also Read: TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు

పంజాబ్ నుంచి రేసులో రాఘవ్ చద్దా, తరుణ్ చుగ్, సునీల్ జాఖడ్ వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రవ్‌నీత్ బిట్టూ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో పంజాబ్ నుంచి ఒక మంత్రి పదవి ఖాళీ అవుతుంది. బీజేపీ ఇక్కడ కేవల్ సింగ్ థిల్లాన్‌ను పంజాబ్ అధ్యక్షుడిగా నియమించింది. ఒక హిందువుకు కేబినెట్‌లో అవకాశం ఇస్తుందని సమాచారం. మంత్రి పదవి రేసులో రాఘవ్ చద్దా, సునీల్ జాఖడ్, తరుణ్ చుగ్ పేర్లు వినిపిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్ హింసాత్మక జ్వాలల్లో నలిగిపోతోంది. ఇక్కడ మైతేయి, కుకీ వర్గాల మధ్య జాతి సంఘర్షణలకు పెద్ద చరిత్రే ఉంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు వీధుల నుంచి పార్లమెంట్ వరకు మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఎన్నికల కంటే ముందే ఏ వర్గంలోనూ అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకు, ఇక్కడి వివిధ వర్గాల నాయకులకు కేబినెట్ లేదా పార్టీ సంస్థాగత పదవుల్లో చోటు కల్పించి సమతుల్యతను సాధించాలని బీజేపీ భావిస్తోంది.