ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల 'మ్యాచ్ ఫిక్సింగ్' చేశారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కామెంట్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ వాస్తవాలను వక్రీకరించారని, అదే సమయంలో ప్రజల తీర్పును అవమానించారని వ్యాఖ్యానించారు. ముందు ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, అలాంటి పార్టీ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజల నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నారా అని ఎద్దేవా చేశారు.  రాహుల్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉన్నాయని, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.

Continues below advertisement


ఈసీ కూడా రాహుల్ ఆరోపణలను ఖండించింది..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) సైతం లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో తన కాలమ్‌లో, రాహుల్ గాంధీ గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే అని, దాన్ని పెద్దగా పట్టించుకోకూడదని సూచించారు. రాహుల్ గాంధీ విభజన రాజకీయాలు చేస్తున్నారని, ఆఖరికి ఎన్నికల కమిషన్ రూల్స్ ను సైతం విస్మరిస్తున్నారని గుర్తుచేశారు.


నకిలీ ఓటర్ల కామెంట్లపై ఫడ్నవీస్ మండిపాటు
ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా యువ ఓటర్ల సంఖ్య పెరుగుదల సాధారణ ప్రక్రియ అని.. అందుకు భిన్నంగా రాహుల్ గాంధీ వారిని 'నకిలీ ఓటర్లు' అనడం సరికాదని ఫడ్నవీస్ హితవు పలికారు. మహారాష్ట్రలో 26 లక్షలకు పైగా యువ ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుందన్నారు. 2024లో మహారాష్ట్ర ఓటర్ల సంఖ్యలో అసాధారణ మార్పు లేదన్నారు.


ఓటింగ్ శాతాన్ని చివరి నిమిషంలో పెంచడం ద్వారా ఎన్డీఏ ప్రయోజనం పొందిందని రాహుల్ గాంధీ చేసిన హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎక్కువ పోలింగ్ జరిగిన చోట్ల సైతం ప్రతిపక్ష అభ్యర్థులకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని కొన్ని ప్రాంతాల వివరాలను ప్రస్తావించారు. నకిలీ ఓటర్లు, ఫిక్సింగ్ లాంటి ఆరోపణలతో పాటు వాస్తవాలు దాచిపెట్టారనే ఆరోపణలను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో రాహుల్ చేసిన యాత్రకు ప్రజలు వెళ్లలేదని, కాంగ్రెస్ ఎంపీకి ఎలాంటి మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు తొలగించడం, రాజ్యాంగ మార్చడం చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని మండిపడ్డారు. 


ఎన్నికల్లో ఓటమితో రాహుల్ గాంధీ ఓటమి కట్టు కథలు అల్లుతున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో ఎక్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులుగా రాహుల్ గాంధీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరాధార విషయాలు వ్యాప్తి చేయడం ప్రజలను, రాజ్యాంగబద్ధ సంస్థలను కించకపరచడమే అన్నారు. 


ఎన్నికల కమిషన్ రియాక్షన్
ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొంటారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, ఈసీని, ప్రజలను అవమానించడమే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.  'నకిలీ ఓటర్లు', రిగ్గింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది ఈసీ. రాష్ట్రంలో 26 లక్షలకు పైగా కొత్త ఓటర్లు ఉన్నారని, ఎన్నికల కమిషన్ లేఖను చదవాలని రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ సూచించారు.