ప్రపంచాన్ని వణికిస్తోన్న పెగాసస్ స్పైవేర్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త యాప్ వచ్చింది. ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. మీ ఫోన్ పెగాసస్ బారిన పడిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రస్తుతానికి ఐఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.


స్విట్జర్లాండ్‌లోని జెనీవా చెందిన డిజి డీఎన్ఏ (DigiDNA) ఈ విషయాన్ని గుర్తించింది. ఈ సంస్థ తన ఐవోఎస్ డివైజ్ మేనేజర్‌ను ఐమాజింగ్ (iMazing) యాప్‌తో అప్‌డేట్ చేయడం ద్వారా ఫోన్లలో పెగానస్ జాడను కనుగొంది. ఆమ్నెస్టీ మొబైల్ వెరిఫికేషన్ టూల్‌కిట్‌ను (MVT) రిఫరెన్స్‌గా ఉపయోగించి కంపెనీ ఈ ఫీచర్‌ను రూపొందించింది.



ఈ యాప్‌ను మ్యాక్ లేదా విండోస్ పర్సనల్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని ఐమాజింగ్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. 


ఐమాజింగ్ 2.14లో భాగంగా స్పైవేర్ డిటెక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. డివైజ్‌లలో పెగాసస్ జాడను గుర్తించడంలో సహాయపడటానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ సూచించిన మెథడాలజీని ఇందులో ఉపయోగించారు. ఇదో యూజర్ ఫ్రెండ్లీ టూల్ అని, గతంతో రూపొందించిన టూల్స్‌తో పోలిస్తే ఇది వాడటానికి సులభంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 



ఐమాజింగ్ ద్వారా పెగాసస్ స్పైవేర్‌ను ఎలా గుర్తించాలి?



  • మొదట కంప్యూటర్‌లో ఐమాజింగ్ 2.14ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మొదటిసారి ప్రాంప్ట్ చేసినప్పుడు.. ట్రయల్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

  • లైటినింగ్ కేబుల్ ఉపయోగించి కంప్యూటర్‌కు.. మీ ఐఫోన్‌ను కనెక్ట్ చేయాలి.

  • తర్వాత కుడి వైపున ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద కొన్ని ఉన్న వాటిలో డిటెక్ట్ స్పైవేర్‌ ఆప్షన్ ఎంచుకోవాలి.  

  • దీంతో కొత్త విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో స్పైవేర్ డిటెక్షన్ టూల్‌ అనే బటన్‌ని ఎంచుకోవాలి.  

  • ఇప్పుడు ఐమాజింగ్ యూప్ సర్వర్ నుంచి స్ట్రక్చర్డ్ థ్రెట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్రెషన్ (STIX) ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయాలా? అని అడుగుతుంది.  


Also Read: Spyware Attack: పెగాసస్ మీ ఫోన్ పై దాడి చేసిందా.. ఇలా చెక్ చేసుకోండి



  • డౌన్‌లోడ్ పూర్తయ్యాక.. మీ ఐఫోన్ డేటా అనాలిసిస్ కోసం లోకల్ బ్యాకప్ క్రియేట్ చేయమని అని అడుగుతుంది. బ్యాకప్ ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్ చేయమని సూచిస్తుంది. బ్యాకప్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించిన పాస్ వర్డ్.. ప్యూచర్ రిఫరెన్సులకు పనికొస్తుంది.  

  • ఇప్పుడు ఐమాజింగ్ బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆటోమెటిక్‌గా పూర్తి అవుతుంది. 

  • బ్యాకప్ పూర్తయ్యాక.. ఐమాజింగ్ డేటాను డీక్రిప్ట్ చేస్తుంది. పెగాసస్ స్పైవేర్ ఫైల్స్‌ను విశ్లేషిస్తుంది. 

  • చివరిగా మీ ఫోన్‌లో స్పైవేర్ ఉందా? లేదా? అనే విషయాన్ని చూపిస్తుంది.  


Also Read: Supreme Court on Pegasus: పెగాసస్‌పై విచారిస్తుండగా సోషల్‌మీడియాలో సమాంతర చర్చలెందుకూ.. కంట్రోల్ చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు