Congress MPs Suspended: కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు స్పీకర్. ధరల పెరుగుదలపై సభలో నిరసన చేయడం, నినాదాలు ఇవ్వడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు మాణిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జులై 18న మొదలైన వర్షాకాల సమావేశాలు.. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి.
స్పీకర్ వార్నింగ్
ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదని, ఎంపీలందరూ హుందాగా ప్రవర్తించాలని కోరారు.
ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు ఈరోజు స్పీకర్ చైర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్లకార్డులు పట్టుకున్న ఎంపీలను డిస్‌క్వాలీఫై చేయాలని కోరారు. వెల్‌లోకి విపక్ష సభ్యులు రావడంతో ఆయన సభను 3 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం కూడా పరిస్థితులు చక్కబడలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.
Also Read: Father Kills Son In Gujarat: ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ కథ- కొడుకును ముక్కలుగా నరికి పారేసిన తండ్రి!
Also Read: Sri Lanka President's office: తిరిగి తెరుచుకున్న శ్రీలంక అధ్యక్ష భవనం