Pahalgam Terror Attack: జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తుంది. పహల్గాం దాడి తర్వాత నుం;చి NIA బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి, దీనిలో ఫోరెన్సిక్ బృందం, దర్యాప్తు బృందం ఉంది.
భారత ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాత అధికారికంగా NIA ఈ కేసు టేకప్ చేసింది. ఇప్పుడు ఈ కేసును NIA దర్యాప్తు చేస్తుంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు సహా ఇతర సంస్థలు NIAకి సహకరిస్తాయి.