Rajasthan BJP MLA: రాజస్థాన్ లోని హవామహల్ బీజేపీ ఎమ్మెల్యే బాలముఖుంద్ ఆచార్యపై మత విద్వేష కేసు నమోదు అయింది. జైపూర్‌లోని జామియా మసీదు వెలుపల నినాదాలు చేసినందుకు బిజెపి హవా మహల్ ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఆచార్యపై శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. చివరుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటలకు ఎమ్మెల్యే అతని మద్దతుదారులు మసీదు వెలుపల గుమిగూడి ఆ ప్రాంతంలో పోస్టర్లు అంటించి నినాదాలు చేయడం ప్రారంభించారు. జైపూర్‌లోని జోహరీ బజార్‌లో ఉన్న జామా మసీదు వద్ద బాలముఖుంద్ ఆచార్య , ఆయన మద్దతుదారులు పహల్గామ్ ఉగ్రవాద దాడి కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సమయంలో, ఆచార్య మసీదు లోపల జూతాలతో ప్రవేశించి, “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. మసీదు గోడలపై అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించినట్లు జామా మసీదు కమిటీ ఆరోపించింది. ఈ చర్యలు మతపరమైన భావాలను గాయపరిచాయని, శాంతిభద్రతలను భంగం చేశాయని ఫిర్యాదు చేశారు. మరో వర్గం కూడా గుమికూడటంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
దీంతో జైపూర్ కమిషనర్ బిజు జార్జ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రఫీక్ ఖాన్,అమీన్ కాగ్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జామా మసీదు కమిటీ ఫిర్యాదు మేరకు మనక్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బిజెపి ఎమ్మెల్యే తన బూట్లు ధరించి మసీదులోకి ప్రవేశించి గోడపై కొన్ని పోస్టర్లు అతికించడానికి ప్రయత్నించాడని ఫిర్యాదుచేశారు. శాంతిని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బాలముఖుంద్ ఆచార్యకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. 2023లో మత విద్వేష కేసు నమోదైంది. ఆయన ముస్లిం సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈ కేసు నమోదుఅయింది.
జైపూర్‌లోని జోహరీ బజార్‌లో ఉన్న జామా మసీదు వద్ద బాలముఖుంద్ ఆచార్య , ఆయన మద్దతుదారులు పహల్గామ్ ఉగ్రవాద దాడి కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సమయంలో, ఆచార్య మసీదు లోపల జూతాలతో ప్రవేశించి, “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. మసీదు గోడలపై అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించినట్లు జామా మసీదు కమిటీ ఆరోపించింది. ఈ చర్యలు మతపరమైన భావాలను గాయపరిచాయని, శాంతిభద్రతలను భంగం చేశాయని ఫిర్యాదు చేశారు.