Seethe Ramudi Katnam Serial Today Episode రేఖ మహాలక్ష్మీతో నన్ను మీతో కలుపుకోండి అత్తయ్య అని రేఖ అంటుంది. మహాలక్ష్మీ సరే అంటుంది. నలుగురుం కలిసి సీత అంతు చూద్దామని అనుకుంటారు. ఇంతలో చలపతి వచ్చి మీ టీంలోకి రేఖని చేర్చుకున్నారా. నలుగురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. మీరు ఎన్ని ప్లాన్‌లు వేసిన ఏం చేయలేరు సీత చేతిలో మీరు అయిపోతారని అంటాడు.
సీత ముఖర్జీతో ఆ ఇంట్లోకి వెళ్లాలని సీతగా వెళ్లలేను కాబట్టి మిధునలా వెళ్తానని అంటుంది. ఇంతలో రామ్ వస్తాడు. నువ్వు సీత విడాకులు తీసుకుంటున్నారని టాక్ ఉంది నన్ను పెళ్లి చేసుకో అంటుంది. దానికి రామ్ నాకు సీత మాత్రమే భార్య ప్రాణం పోయిన ఇంకో భార్య వద్దు మీరు అదే మాట్లాడాలి అంటే నేను వెళ్లిపోతా అని చెప్పి వెళ్లిపోతుంటే ముఖర్జీ కూర్చొమని చెప్తాడు. మిధున రామ్‌తో నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా మేం మీతో బిజినెస్ మానుకోవాలి అనుకోవడం లేదు. మనం ఓ ఫ్యాక్టరీ కట్టాలి అందుకు ల్యాండ్ సెలక్షన్‌కి వెళ్లాలి అని అంటుంది. నేను నీ పార్టనర్ కాకపోయినా నీ బిజినెస్ పార్టనర్‌ని నువ్వు నాతోనే రావాలి అంటుంది. మిధున వద్దు కావాలి అంటే మీరు రండి అంటాడు. ముఖర్జీ రామ్‌తో ఇద్దరూ సరదాగా వెళ్లిరండి మన రిసార్ట్ కూడా ఉంది సరదాగా 3 రోజులు ఉండి కూడా రండి అని అంటాడు.
మిధున ఇక రామ్‌కి ఓకే కాదేమో వాళ్ల పిన్నికి చెప్తాడేమో అని రెచ్చగొడుతుంది. దాంతో రామ్ నేం అవసరం లేదు అని అంటాడు. ఉదయం వచ్చి పిక్ చేసుకోమని చెప్తుంది. తర్వాత ముఖర్జీ, సీత నవ్వుకుంటారు. మరోవైపు జనార్థన్ సుమతి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు. మహాలక్ష్మీ వచ్చి జనా ఏంటి చనిపోయిన సుమతిని చూస్తున్నాడు చచ్చిపోయిన సుమతి గుర్తొచ్చిందా అనుకుంటుంది. సుమతిని ఎవరో చాలా దారుణంగా చంపారు. సుమతిని వెంటాడి చంపాల్సినంత కోపం పగ ఎవరికి ఉందో తెలీడం లేదు.. సుమతిని చంపిన ఆ హంతకుడిని నేను వదిలి పెట్టను అని గన్ తీసి వాడిని నా చేతులతోనే కాల్చి చంపేస్తా అని గన్ గురిపెడతాడు. అటుగా వచ్చిన గౌతమ్ ఈయన ఏంటి ఇప్పుడు గన్ తీశాడు అనుకుంటాడు. మహాలక్ష్మీ ఇంతలో జనాని ఆపుతుంది. గౌతమ్ వెళ్లిపోతాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. అందంతా చూసిన అర్చన గౌతమ్‌ని బావ గారు చంపేస్తారు. తర్వాత నువ్వు ఆ తర్వాత నేనేనా అని షాక్ అయిపోతుంది. దానికి మహాలక్ష్మీ రాజు పీనుగు ఎప్పుడూ ఒంటరిగా వెళ్లదు కదా అని అంటుంది. రామ్ పుల్లయిస్‌లు రెండు తీసుకొని తింటాడు. ఇంతలో సీత వచ్చి ఒకటి తీసుకుంటుంది. రామ్ సీతతో నువ్వు వచ్చావేంటి అని అడుగుతాడు. దాంతో సీత నాపేరు తలచుకొని నువ్వు ఐస్ తింటే నేను రానా అంటుంది. నువ్వు వచ్చి మంచి పని చేస్తున్నావ్ సీత నాకు రిలీఫ్‌గా ఉంది. అని మిధున గురించి చెప్తాడు. నేను రమ్మన్నా నువ్వు రావు మిధున వద్దన్నా వదలదు అని అంటాడు. మిధున కన్ను నీ మీద పడింది తన నుంచి తప్పించుకోగలవా అంటుంది. ఏదైతే అది అవుతుంది నేను వెళ్లను అంటాడు. సీత ఒప్పించి పంపిస్తుంది. ఇక రేఖ గౌతమ్‌తో నా మెడలో తాళి ఎప్పుడు కడతావ్ అని అడుగుతుంది. ఇక గౌతమ్ రేఖ చేతులు పట్టుకొని బతిమాలుతూ మాట్లాడటం అందరూ చూస్తారు. పెళ్లి వరకు కాస్త దూరంగా ఉండండి అని మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!