PM Modi 124 Mann ki Baat | అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రజలు ఆనందంతో గంతులు వేశారని, శుభాంశు శుక్లా కారణంగా భారతదేశం అంతటా పిల్లల్లో అంతరిక్షం పట్ల కొత్త ఉత్సుకత పెరిగిందన్నారు. నేడు అంతరిక్ష రంగంలోనే 200లకు పైగా స్టార్టప్‌లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 124వ మన్​ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని ప్రధాని పిలుపునిచ్చారు.

నమో యాప్ ద్వారా మీరు సలహాలు, సూచనలు పంపండి..‘గత కొన్ని వారాలుగా స్పేస్, సైన్స్ రంగాల్లో విజయాల గురించి మనం మాట్లాడుతున్నాం. వ్యోమగామి శుభాంశు శుక్లా భూమిపైకి తిరిగి వచ్చారు. చంద్రయాన్-3 సక్సెస్ సమయంలోనూ దేశంలో ఎంతో ఉత్సాహం నెలకొంది. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే. ఈ సందర్భంగా నమో యాప్ ద్వారా మీరు సలహాలు, సూచనలు పంపండి’ అని పేర్కొన్నారు. 

అనేక త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటున్నాంఈ సందర్భంగా స్వాతంత్ర్య మరయోధుడు ఖుదిరామ్ బోస్ గురించి ప్రస్తావించారు. ‘1908లో ముజఫర్​పూర్​లో ఓ యువకుడిని ఉరితీశారు. ఆ సమయంలో అతడి ముఖంలో భయం లేదు.. ఆత్మవిశ్వాసం ఉంది. అతడి పేరు ఖుదిరామ్ బోస్. వయసు 18 ఏళ్లు. దేశాన్ని కదిలించాడు. అలాంటి అనేక త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటున్నాం’ అని అన్నారు.

స్వదేశీ ఉద్యమం స్థానిక ఉత్పత్తుల్లో బలం చేకూర్చింది‘ఆగస్టు నెల ఓ విప్లవ మాసం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొంటాం.1905 ఆగస్టు 7వ తేదీన సరికొత్త ఉద్యమం మొదలైంది. స్వదేశీ ఉద్యమం స్థానిక ఉత్పత్తుల్లో బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో ఇది కనిపించింది. దానికి చిహ్నంగానే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వస్త్ర తయారీ రంగం దేశానికి అదనపు బలంగా మారింది. మహారాష్ట్ర నుంచి కవిత ధావ్లా, ఒడిశా నుంచి మయూర్భాంజ్, బిహార్ నుంచి నవీన్ కుమార్ చేనేతలో స్పూర్తిదాతలుగా ఉంటున్నారు’. 

అక్కడ 40 రకాల గడ్డి పక్షులు ఉన్నాయి‘భారతదేశం ఒలింపిక్స్ మరియు ఒలింపియాడ్ కోసం ముందుకు సాగుతోంది. మహారాష్ట్రలో 12 కోటలు ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది. కొన్నేళ్ల క్రితం రాయగడ్​కు వెళ్లాను. ఆ పర్యటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు తెలిసిన పక్షుల గురించి అడిగితే, మీరు 4-5 జాతుల పక్షుల గురించి చెబుతారు. కానీ అస్సాంలోని కజిరంగా నేషనల్​ పార్క్​లో గడ్డి భూమి పక్షులకు నిలయం. అక్కడ 40 రకాల గడ్డి పక్షులు ఉన్నాయి. వాటి కూతల ఆధారంగా ఏఐ గుర్తించింది. టెక్నాలజీ, సెన్సివిటీ కలిస్తే ప్రతిదీ తేలిక అవుతుంది’ అని ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో మాట్లాడారు.