ONGC Chopper: ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కి చెందిన ఓ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో కుప్పకూలింది. సాంకేతిక సమస్య రావడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా రిగ్‌పై ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు.
ఆ క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రయాణ సమయంలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది ఉన్నారు.
నలుగురు మృతి
ఘటనపై వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టారు. అయితే 9 మందిలో ఐదుగురిని మాత్రమే కాపాడగలిగారు. ప్రమాద సమయంలో చాపర్‌లో మొత్తం ఇద్దరు పైలట్లు, ఓ క్రాంటాక్ట్ ఉద్యోగి, ఆరుగురు ఓఎన్‌జీసీ సిబ్బంది ఉన్నారు.
ఇలా జరిగింది
ముంబయి తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తీరం నుంచి సముద్ర మధ్యలోని రిగ్‌పై హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో సాంకేతిక సమస్య కారణంగా ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో పడిపోయింది.
అయితే ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఓఎన్‌జీసీ ప్రకటించింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పేర్కొంది.
Also Read: ED Summons Sanjay Raut: సంజయ్ రౌత్‌కు మరో షాక్- ఆ కేసులో మరోసారి ఈడీ సమన్లు