Rahul Gandhi Speech:


స్పీకర్‌కి థాంక్స్ చెప్పిన రాహుల్..


ఎంపీ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్‌లో ప్రసంగించారు. తన సభ్యత్వాన్ని రీస్టోర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదానీ వ్యవహారంపై మాట్లాడనంటూ బీజేపీపై సెటైర్లు వేశారు. ఇదే క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గాంధీ...ముందుగా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడారు. తన యాత్ర ఇంకా ముగిసిపోలేదని, రెండోసారి యాత్ర నిర్వహిచేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.


"లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్‌ గారికి ధన్యవాదాలు. నేను చివరిసారి మాట్లాడినప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటాను. ఎందుకంటే నేను అప్పుడు అదానీ వ్యవహారంపై మాట్లాడాను. బహుశా మీ సీనియర్ లీడర్ (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) బాధ పడ్డారేమో. బహుశా ఆ బాధ మీపైన (స్పీకర్‌ని ఉద్దేశిస్తూ) కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. కానీ నేను మాట్లాడింది నిజం. కానీ ఈ సారి బీజేపీ మిత్రులు ఏం భయపడాల్సిన పనిలేదు. నేను ఇప్పుడు అదానీ గురించి మాట్లాడడం లేదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ