No Confidence Motion: 


అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో అడుగు పెట్టారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సభలోకి వచ్చారు. ఈ క్రమంలోనే అధిర్ రంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించిన ఘనత అవిశ్వాస తీర్మానానిదే అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నో రోజులుగా ప్రధాని సభకు వచ్చి మణిపూర్‌పై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నట్టు గుర్తు చేశారు. తాము అవిశ్వాస తీర్మానం గురించి పెద్దగా ఆలోచించడం లేదని, కేవలం ప్రధాని ఈ అంశంపై ఏదో ఓ ప్రకటన చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 


"ప్రధాని నరేంద్ర మోదీని లోక్‌సభకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత అవిశ్వాస తీర్మానానిదే. మేమెవ్వరమూ ఈ తీర్మానం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ప్రధాని మోదీ సభకు వచ్చి మణిపూర్ గురించి మాట్లాడాలని మాత్రమే డిమాండ్ చేశాం:


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ






ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చారు అధిర్ రంజన్. ఒకప్పుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే అంధుడైన ధృతరాష్ట్రుడు ఎలాగైతే నిస్సహాయంగా ఉండిపోయాడో...ఇప్పుడు మణిపూర్ విషయంలో మోదీ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. 


"ధృతరాష్ట్రుడు అంధుడు. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రధాని మోదీ వైఖరి కూడా ఇలానే ఉంది. మణిపూర్‌ తగలబడిపోతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. హస్తినాపురానకి, మణిపూర్‌కి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు"


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ