వివాదాస్పద స్వామి నిత్యానంద తాను సమాధిలోకి వెళ్లానని ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన చనిపోయారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఖండించారు.  కైలాస్ అవతార్ క్లిక్స్ అనే ఫేస్‌బుక్ పేజీలో తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో వివరించారు. తాను సమాధిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.   తాను వచ్చి మాట్లాడటానికి మరికొంత సమయం పడుతుంది అని ఆయన రాసుకొచ్చారు. కైలాస ప్రదేశాలు ప్రశాంతంగా ఉంటాయి. దీని గురించి ఎవరికైనా సందేహం ఉంటే తిరుమన్నామలై అరుణగిరిలోని యోగేశ్వర సమాధికి వెళ్లండి. అప్పుడు నేను వారికి అక్కడ స్పష్టంగా కనిపిస్తానని భక్తులకు ఆఫర్ ఇచ్చారు.



చార్​ధామ్ యాత్రలో విషాదాలు, ఇప్పటివరకు 31 మంది భక్తులు మృతి - కారణం ఏంటంటే !


అయితే నిత్యానంద తనకు 27 మంది వైద్యులు చికిత్స చేస్తున్నారని ప్రకటించారు. కానీ  ఎలాంటి అనారోగ్యమూ లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను అనారోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఎలాంటి అనారోగ్యం లేకపోతే ఏకంగా 27 మంది వైద్యులతో ఎందుకు చికిత్స తీసుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే తాను మనుషుల పేర్లు కూడా గుర్తు పట్టలేకపోతున్నట్లుగా.. కష్టంగా ఉందని కూడా చెబుతున్నారు. అంటే.. నిత్యానందకు తీవ్రమైన జబ్బే ఉందని భావిస్తున్నారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పకనే చెప్పారంటున్నారు. 


ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన


2019 నుండి ఈక్వెడార్ తీరంలో ఉన్న ద్వీపంలో తలదాచుకున్నారు. దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతను పరారీలో ఉన్నారు. కైలాసాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిత్యానంద ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి కూడా చేశారు. ఆ తర్వాత కైలాస డాలర్‌ను తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయన ప్రతీ ప్రకటన ఓ సంచలనమైంది.


గగన్‌యాన్ బూస్టర్ సక్సెస్ - నెక్ట్స్ ఇక వ్యోమగాములతోనే !


మరో వైపు ఆయన కోసం ఇంటర్ పోల్ అధికారులు బ్లూ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. ఇప్పుడు చికిత్స కోసం ఖచ్చితంగా ఇతర దేశాలకు వెళ్తాడు కాబట్టి పట్టుకోవడం సులభమని బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.