ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్ష పెడుతున్నాయని, ప్రతి భారతీయుడికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రేడియో ప్రోగ్రామ్​ మన్ కీ బాత్ (Mann Ki Baat) 125వ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 ప్రజలు భారీ నష్టాలను చవిచూశారు‘ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్ష పెడుతున్నాయి. గడిచిన కొన్ని వారాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో పలు చోట్ల భారీ నష్టం జరిగింది. ఇండ్లు నేలమట్టమయ్యాయి. పంటలు మునిగాయి. ప్రజలు భారీ నష్టాలను చవిచూశారు. వరదలతో బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలు ప్రతి భారతీయుడి మనసును కలచివేశాయి. వారి బాధలను ప్రతిఒక్కరూ పంచుకుంటున్నారు’ అని అన్నారు. విపత్తుల వేళ తీవ్రంగా శ్రమిస్తున్న NDRF, SDRF, సామాజిక కార్యకర్తలు, డాక్లర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

టెక్రాలజీ సాయంతో విశేష సేవలు..‘విపత్తులు సంభవించిన చోటకు మన NDRF–SDRF బృందాలు, సెక్యూరిటీ ఫోర్స్​  చేరుకొని రాత్రింబవళ్లు శ్రమించి ప్రజల ప్రాణాలను రక్షించారు. టెక్రాలజీ సాయంతో విశేష సేవలు అందించారు. థర్మల్​ కెమెరాలు, లైవ్​ డికెక్టార్స్​తో, స్నైపర్​ డాగ్స్​, డ్రోన్​ సర్వైలెన్స్​ ను ఉపయోగించుకొని సేవలందించారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సామగ్రి, ఆహారం అందించారు. సాయమందించేందుకు సాయుధ బలగాలు విశేష కృషి చేశాయి. స్థానికులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు ముందుకొచ్చారు. విపత్తల వేళ మానవత్వం చాటుకున్న ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు’ అని మోదీ పేర్కొన్నారు.  

యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతుయూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ (Pratibha Seru) పోర్టల్​ను ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ఈ పోర్టల్​ ద్వారా యూపీఎస్సీ అభ్యర్ధులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ‘దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి. ప్రతి ఏటా ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేసి కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రతిభా సేతు' పోర్టల్​ను ప్రవేశపెట్టాం’ 

అలాంటివారికి ప్రైవేట్​ కంపెనీల్లో జాబ్​‘సివిల్స్ పరీక్షల్లో అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్ధుల వివరాలను ఇకపై ఈ పోర్టల్​లో ఉంచనున్నాం. ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకొని తమ సంస్థల్లో వారికి ఉపాది కల్పించనున్నాయి’ అని మోదీ అన్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.