Rummy And Poker Are Games Of Skill:


పేకాట.. ఇదో వ్యసనం. దీన్నే ఇప్పుడు అడ్వాన్స్‌ర్డ్‌ పద్ధతిలో పోకర్‌ అండ్‌ రమ్మీ పేరుతో పరిచయం చేశారు. ఈ గేమ్‌ ఆన్‌లైన్‌లోరూ, ఆఫ్‌లైన్‌లోనూ ఆడవచ్చు. మొబైల్‌  ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాటలో గెలవడం అంత ఈజీ కాదు. లక్‌ ఉండాలి.. లేదంటే ఉన్నదంతా ఊడ్చేస్తుంది. ఈ వ్యసనానికి అలవాటు  పడిన ఎంతోమంది బతుకులు ఛిద్రమైపోయాయి. ఇంకా ఎంతో మంది... ఈ మాయాజూదం మత్తులో ఉన్నారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులవ్వాలనే దురాశ.. వ్యాసనాలకు  బానిసలు చేస్తోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వైపు లాగుతుంది. ఇలాంటి ఆటల్లో ఒకటి పోకర్‌ అండ్‌ రమ్మీ. ఈ గేమ్‌లో గెలవాలంటే.. లక్కుండాలి అని అంటారు చాలా మంది. కానీ, అది నిజం కాదంటున్నారు నిపుణులు. నైపుణ్యం ఉంటే చాలు... ఇట్టే గెలవచ్చని చెప్తున్నారు. ఇది నిజమేనా..? పేకాట ఆడేందుకు... తెలివితేటలు, నైపుణ్యాలు కావాలా.  ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరు..? నిజంగానే పేకాటకు నైపుణ్యం కావాలా..


పేకాట, రమ్మీ గేమ్స్‌ అదృష్టం కంటే నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటాయన్నారు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లు. అంతేకాదు పోకర్‌, రమ్మీ ఆడటం వల్ల నైపుణ్యాలు మెరుగవుతాయని  చెప్తున్నారు. ఆడేవారి తెలివితేటలు కూడా పెరుగుతాయట. నిపుణ్యాభివృద్ధికి పేకాట, రమ్మీ ఆటలు దోహదపడతాయని చెప్తున్నారు ఐఐటీ ఢిల్లీ ఫ్రొఫెసర్లు. వీరి చేసిన  పరిశోధనలో... పోకర్‌ అండ్‌ రమ్మీ గేమ్‌ గురించి అనేక విషయాలు తెలుసుకున్నారట. వాస్తవంగా.. ఈ గేమ్‌లు ఆడేందుకు ఒక స్థాయి, సహజమైన అవగాహన అవసరమని  వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఆటగాళ్ల సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా సహాయపడుతుందట. పోకర్ మరియు రమ్మీ గేమ్స్‌ ఆన్‌లైన్‌లో ఆడినా.. ఆఫ్‌లైన్‌లో ఆడినా  ఆటగాళ్ల నైపుణ్యం రెట్టింపు అవుతుందని వారి అధ్యయనం తేలిందని చెప్తున్నారు. 


పోకర్, రమ్మీ వంటి ఆటలు అదృష్టంపై ఆధారపడి ఉన్నాయా నైపుణ్యం మీదనా అనే విషయంలో అధ్యయనం చేశారు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లు. ఈ అధ్యయనంలో ఈ గ్రేమ్స్‌కు  సంబంధించి కీలక విషయాలు తెలిశాయన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ యొక్క కాడెన్స్ చైర్ ప్రొఫెసర్ తపన్ కె. గాంధీ. ఈ గేమ్స్‌ ఆడేవారికి చాలా నైపుణ్యం  కావాలట. సామాజిక సూచనలను అర్థం చేసుకోవడం, అత్యంత ఒత్తిడిలోనూ నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తిని కాపాడుకోవడం... అలాగే నిరంతరం ఆటలో ముందుకు  సాగడం వంటి సృజనాత్మక నైపుణ్యాలును రమ్మీ ఆడేవారిలో గమనించామన్నారు. పోకర్, రమ్మీ రెండు గేమ్స్‌లోనూ ఆటగాళ్లలో... ఎంత ఎక్కువ గేమ్స్‌ ఆడితే... నైపుణ్యం  అంత ఎక్కువ రెట్లు మెరుగుపడుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. 


పోకర్‌, రమ్మీ గేమ్స్‌లో నెగ్గాలంటే నైపుణ్యమని ప్రధానమని... ఆన్‌లైన్‌లో ఆడినా, ఆఫ్‌లైన్‌లో ఆడినా... ప్రతిభే ఆధిపత్యం చెలాయిస్తుందని అన్నారు. అందరూ  అనుకుంటున్నట్టు అదృష్టం ఉంటే గెలవొచ్చనేది అపోహ మాత్రమే అని తేల్చారు. క్రికెట్, గోల్ఫ్ మొదలైన క్రీడల మాదిరిగానే.. పోకర్‌, రమ్మీ ఆటగాళ్లు కూడా... వైవిధ్యమైన  రీతిలో సవాళ్లను ఎందుర్కొంటారని తెలిపారు.  ఈ విషయాలు విని... అందరూ ఆశ్చర్యపోయినా ఇదే నిజమని అంటున్నారు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లు.