Lift Collapse: ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ కాంపౌండ్ లో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో లిఫ్ట్ కుప్పకూలింది. నాలుగో అంతస్తు వద్ద ఉన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయింది. ఈ ఘటన సమయంలో లిఫ్టులో 12 నుంచి 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ సి వింగ్ లో ఉన్న లిఫ్ట్ కు  ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు బృహన్ ముంబై అధికారులు వెల్లడించారు. 


' ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ లో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో ప్రమాదం జరిగింది. భవనం సి - వింగ్ లోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మొత్తం 16 అంతస్తుల ఈ బిల్డింగ్ లో లిఫ్ట్ నాలుగో అంతస్థు వద్ద ఉన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయింది. ప్రమాద సమయంలో ఈ లిఫ్ట్ లో 12 - నుంచి 14 మంది ఉన్నారు. భవన సిబ్బంది హుటాహుటినా స్పందించి లిఫ్ట్ లో ఉన్న వారిని రక్షించారు' అని బీఎంసీ పేర్కొంది. 


లిఫ్ట్ కుప్పకూలిన ఘటనపై 10.49 గంటల ప్రాంతంలో ముంబై అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. మొత్తం 12 - 14 మంది లిఫ్ట్ లో ఉండగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఏడుగురిని పరేల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒకరిని అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మందికి స్వల్ప గాయాలు కాగా వారు ఆస్పత్రిలో చేరడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఏ ఆపదా లేదని రెండు ఆస్పత్రుల వైద్యులు తెలిపారు. 


Also Read: Chhattisgarh Fire Accident: కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం, భయంతో బిల్డింగ్ నుంచి దూకేసిన ప్రజలు


ముంబైలో లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి


కొన్ని రోజుల క్రితం ముంబయిలో లిఫ్ట్ డోరులో ఇరుక్కుని ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ముంబయిలోని శివారు ప్రాంతం అయిన మలాడ్ చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. జెనెల్ ఫెర్నాండెజ్ అనే 26 ఏళ్ల టీచర్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. లిఫ్ట్ లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ బటన్ నొక్కగానే లిఫ్ట్ తను ఉన్న ఫ్లోర్ కు వచ్చి ఆగింది. ఎప్పట్లాగే ఆమె లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ లోని స్టాఫ్ రూమ్ కు వెళ్లాలనుకుంది. కానీ అనుకోని ప్రమాదం ఆమె ప్రాణాలను తీసింది. ఆమె లిఫ్ట్ లోకి పూర్తిగా వెళ్లక ముందే లిఫ్ట్ తలుపు ఆటోమేటిక్ గా మూసి వేయబడ్డాయి. అంతలోనే లిఫ్ట్ కిందకు వెళ్లడం ప్రారంభించింది. అలా జెనెలె ఫెర్నాండెజ్ లిఫ్ట్ తలుపుల మధ్యలోనే అలాగే ఉండిపోగా.. పాఠశాల సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. పరుగెత్తుకు వచ్చి లిఫ్ఠ్ డోర్ మధ్యలో ఇరుక్కున్న జెనెలె ఫెర్నాండెజ్ ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ టీచర్ తీవ్రంగా గాయాలపాలు అయింది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial