Madhya Pradesh News: ముఖ్యమంత్రికి చల్లారిన ఛాయ్ ఇచ్చినందుకు ఓ ప్రభుత్వ అధికారికి షోకాజ్ నోటీసు అందింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
ఛతర్‌పూర్ జిల్లా ఖజురహో పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నాణ్యత లేని చల్లని టీ అందించినందుకు జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కనౌహాకు నోటీసు వచ్చింది. రాజ్‌నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) డీపీ ద్వివేది ఈ షోకాజ్ నోటీసు అందించారు.
మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఇందులో ఆదేశించారు. లేకుంటే ఏకపక్షంగా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
నోటీసు రద్దు
అయితే ఈ షోకాజ్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఛతర్‌పూర్ కలెక్టర్ సందీప్ జీఆర్ ఆ షోకాజ్ నోటీసును రద్దు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కలెక్టర్ పేర్కొన్నారు.
Also Read: Monsoon Parliament Session: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు
Also Read: Rahul Gandhi Europe Visit: మరోసారి రాహుల్ గాంధీ ఫారెన్ టూర్- కీలక సమావేశాలకు లేనట్లే!