అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా భేటీ అయ్యారు. భారత్-యూఎస్  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, కోవిడ్ -19, వాతావరణ సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇండో-పసిఫిక్‌తో సహా అనేక సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో చర్చించారు.  వైట్ హౌస్ ప్రకటన ప్రకారం బిడెన్ చివరిసారిగా మార్చిలో క్వాడ్ నాయకులతో ప్రధాని మోదీతో మాట్లాడారు. రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రేనియన్ ఆర్థిక వ్యవస్థ 45.1 శాతం క్షీణించిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. అదే సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థ 11.2 శాతానికి క్షీణించిందని అంచనా వేసింది. 






రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలపై 


ఈ సమావేశం ప్రారంభం కాగానే అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ “ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. కోవిడ్-19 సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ల గురించి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సంక్షోభాన్ని గురించి ఆలోచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి" అని అన్నారు. తన వ్యాఖ్యపై ప్రధాని మోదీ స్పందిస్తూ రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. "నేను ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులతో చాలాసార్లు టెలిఫోన్‌లో మాట్లాడాను. శాంతి కోసం వారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరపాలని సూచించాను. భారత పార్లమెంట్‌లో ఉక్రెయిన్‌లో పరిస్థితులపై చర్చలు జరిగాయి, ”అని ప్రధాని మోదీ తెలిపారు. 


బుచా నగరం హత్యలపై విచారణకు డిమాండ్ 


ఇద్దరు నేతల భేటీ సందర్భంగా ఉక్రెయిన్ బుచా నగరంలో జరిగిన హత్యలను భారతదేశం ఖండిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. "బుచా నగరంలో ఇటీవల అమాయక పౌరుల హత్యకు సంబంధించిన వార్తలు ఆందోళన కలిగించాయి. మేము దానిని తక్షణమే ఖండిస్తున్నాం. నిష్పాక్షిక విచారణను కూడా డిమాండ్ చేశాం. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల ద్వారా శాంతికి మార్గం సుగుమం అవ్వాలని ఆశిస్తున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 20,000 మంది భారతీయులను రక్షించడానికి భారతదేశం ప్రారంభించిన వందే భారత్ మిషన్ గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. "చాలా కష్టపడి, వారందరినీ బయటకు తీసుకురావడంలో మేము విజయం సాధించాం" అని ప్రధాని మోదీ అన్నారు.