MK Stalin With PM :  మద్రాస్ హైకోర్టులో గుర్తించినట్లుగానే హిందీలానే తమిళంను కూడా జాతీయ అధికార భాషగా గుర్తించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్  ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులో పలు కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఆయనను ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తమిళ భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్టాలిన్ ఇంగ్లిష్, హిందీలో ప్రసంగించలేదు. తమిళంలోనే ప్రసంగించారు . తాము తమిళనాడు వాళ్లమని.. తమిళంలోనే మాట్లాడతామని కూడా చెప్పారు. కాంగ్రెస్ హయాంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చిందని.." అఫీషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్" లాంగ్వేజ్ హోదా కోసం చాలా కాలంగా పోరాడుతున్నామని స్టాలిన్ తెలిపారు. 


సీఎం అవ్వాలనుకుంటే చివరికి క్లర్క్‌గా- సిద్ధూ జీతం ఎంతో తెలుసా?


కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడుకు రావాల్సిన అంశాలపై కూడా స్టాలిన్ ఈ సందర్ఫంగా ప్రస్తావించారు. జీఎస్టీ పరిహారం నిధులు తమిళనాడుకు రావాల్సి ఉందని వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశామని.. ఆ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ ప్రధానిని కోరారు.  తమిళనాడు అభివృద్ధి ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం , సమానత్వంతో సాయం అందించాలని కోరారు. తమిళనాడు ద్రావిడ అభివృద్ధి నమూనా దేశానికి దిక్సూచీ అన్నారు.


మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!


ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. తమిళనాన్ని ప్రాచీన భాషగా పేర్కొన్నారు. భారతియార్ పాటను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు.  తమిళ భాష సుస్థిరం.. తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని ప్రశంసించారు. తమిళ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జాఫ్నాను సందర్శించిన మొదటి భారత ప్రధాని తానేనని గుర్తుచేశారు.  శ్రీలంక ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని ప్రకటించారు. తమిళనాడు ప్రజలు అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఉన్నారని అభినందించారు.


భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం! 


పలు రకాల కేంద్ర పథకాలతో కూడిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి మోదీ రావడంతో ప్రోటోకాల్ సమస్య రాకుండా అధికారయంత్రాంగం చూసుకుంది. స్టాలిన్ కూడా రాజకీయ విభేదాలున్నప్పటికీ స్వాగతం చెప్పారు. తెలంగాణ పర్యటనలో కేసీఆర్ స్వాగతం చెప్పలేదు.