Mirzapur Train Accident | ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం (నవంబర్ 5) ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్ లో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ఈ విషాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Continues below advertisement

 వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో పాటు SDRF, NDRF బృందాలను సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని, క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.

రైలు నుంచి వైరే వైపు దిగడం వల్లే ప్రమాదం 

రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ దాటుతుండగా, కాలకా-హావడా ఎక్స్‌ప్రెస్ (Netaji Express) పట్టాలపైకి వేగంగా వచ్చిందని సమాచారం. రైలు ఢీకొనడంతో దాదాపు ఆరుగుగురు ప్రయాణికులు చనిపోయారని సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, ప్రమాదంలో వారి శరీరాలు ముక్కలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

Continues below advertisement

వీరంతా కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. అయితే చునార్ రైల్వే స్టేషన్లో రైలు దిగిన తరువాత వారు ప్లాట్‌ఫాం ఉన్నవైపు కాకుండా అవతలివైపు దిగారు. తరువాత రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో మరో ట్రాక్ మీదకు వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అనంతరం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. చునార్ స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.

రైలు ప్రమాదంపై రైల్వే ప్రకటన

రైల్వే ప్రకారం, ఈ రోజు (బుధవారం, నవంబర్ 5) ఉదయం కొందరు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలులో మిర్జాపూర్ లోని చునార్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కాని ప్లాట్ ఫారం వైపు కాకుండా మరోవైపు రైలు దిగారు. అప్పుడే కాలకా-హావడా రైలు లైన్ పైకి వచ్చి ప్రయాణికులను ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర సన్నాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. దాంతో చునార్ రైల్వే స్టేషన్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 

చునార్ స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-4 వద్ద ప్రమాదంఈ ప్రయాణికులు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలు నుంచి చునార్ రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ రైలు  ప్లాట్‌ఫాం నంబర్ నాలుగు వద్ద ఆగింది. ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటి ఒక నంబర్ ప్లాట్‌ఫాం ద్వారా గంగా స్నానానికి వెళ్లాలని భావించారు. అప్పుడే కాలకా-హావడా రైలు ట్రాక్ మీదకు రావడంతో ప్రమాదం జరిగింది. 

మృతుల వివరాలు ఇవే.. 

చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారిలో-

సవిత (భార్య రాజ్‌కుమార్)

సాధన (కుమార్తె విజయ్ శంకర్)

శివకుమారి (కుమార్తె విజయ్ శంకర్)

అప్పు దేవి (కుమార్తె శ్యామ్ ప్రసాద్)

సుశీల దేవి (భార్య మోతీలాల్) మరణించినట్లు ప్రకటించారు.